BSNL Budget Plans: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అనేక బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎప్పటినుంచో ఆఫర్ చేస్తోంది

నెల రోజుల ప్లాన్ మొదలుకొని పూర్తిగా సంవత్సరం వాలిడిటీ అందించే ప్లాన్స్ వరకు మంచి బడ్జెట్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా చవక ధరలో మంచి బెనిఫిట్స్ అందిస్తాయి

BSNL Budget Plans: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందుకోండి.!

BSNL Budget Plans: టెలికాం కంపెనీలు అన్నింటిలో కూడా అతి చవక రేటుకే అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికాం కంపెనీగా బిఎస్ఎన్ఎల్ మాత్రమే నిలుస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అనేక బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎప్పటినుంచో ఆఫర్ చేస్తోంది. అదే పరంపర కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మంచి బడ్జెట్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. బిఎస్ఎన్ఎల్ యూజర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Budget Plans:

నెల రోజుల ప్లాన్ మొదలుకొని పూర్తిగా సంవత్సరం వాలిడిటీ అందించే ప్లాన్స్ వరకు మంచి బడ్జెట్ ప్లాన్లను బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. వీటిలో రూ. 225 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 997 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రెండూ కూడా తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్లకు అందించే ప్రయోజనాలు వివరంగా తెలుసుకుందాం.

Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ మరోసారి బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

బిఎస్ఎన్ఎల్ రూ. 225 ప్లాన్ బెనిఫిట్స్

బిఎస్ఎన్ఎల్ రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, డైలీ 2.5 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో నెలంతా అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇదే కాదు నెల మొత్తం డైలీ 100SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది బడ్జెట్ ధరలో నెల రోజులు అన్లిమిటెడ్ లాభాలు కోరుకునే యూజర్లకు చక్కగా సరిపోతుంది.

BSNL Budget Plans

బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ బెనిఫిట్స్

ఇది బిఎస్ఎన్ఎల్ అందించిన లాంగ్ వాలిడిటీ ప్లాన్ మరియు చాలా తక్కువ ఖర్చులో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 997 రూపాయల ఖర్చులోనే ఏకంగా ఐదు నెలల అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ యూజర్లకు 150 వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా, లిమిట్ ముగిసిన 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 150 రోజులు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు ఐదు నెలల పాటు అన్లిమిటెడ్ లాభాలు లభిస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo