అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి వన్ ప్లస్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. అదే, OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ మరియు అమెజాన్ నుండి ఈరోజు బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. వన్ ప్లస్ లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో వచ్చింది. ఈ ఫోన్ ఆకర్షణనీయమైన డిజైన్, 64MP EIS ట్రిపుల్ కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగివుంది.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus Nord CE 2 Lite 5G: ధర
వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, బహామా బ్లూ మరియు గ్రే మిర్రర్ అనే రెండు కలర్లలో లభిస్తుంది. Buy From Here
1. OnePlus Nord CE 2 Lite 5G : (6GB + 128GB) – రూ.19,999
2. OnePlus Nord CE 2 Lite 5G: (8GB + 128GB) – రూ.21,999
ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ను కేవలం రూ.17,999 రూపాయలకే అందుకోవచ్చు.
OnePlus Nord CE 2 Lite 5G : స్పెషిఫికేషన్స్
వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ LCD డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.
ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, 2MPడెప్త్ మరియు మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది. ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది.