Nvidia CEO Jensen Huang పదవికి రాజీనామా .. AI చిప్ ప్రపంచం పై దీని ప్రభావం ఉంటుందా.!

Highlights

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఈరోజు సంచలన పరిణామం చోటుచేసుకుంది

Nvidia సంస్థ సహ వ్యవస్థాపకుడు, CEO Jensen Huang తన పదవికి రాజీనామా

CEO పదవితో పాటు ఆయన కంపెనీ బోర్డు సభ్యత్వాన్ని కూడా వదులుకున్నాడు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఈరోజు సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్న Nvidia సంస్థ సహ వ్యవస్థాపకుడు, CEO Jensen Huang తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు, 12 నవంబర్ 2026 నుంచి ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించడం కొసమెరుపు. CEO పదవితో పాటు ఆయన కంపెనీ బోర్డు సభ్యత్వాన్ని కూడా వదులుకున్నాడు. మూడు దశాబ్దాలకు పైగా Nvidia ప్రయాణానికి నాయకత్వం వహించిన హువాంగ్ నిష్క్రమణ టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Nvidia CEO Jensen Huang రాజీనామా కారణం

ఇటీవల వెలువడిన వ్యక్తిగత సంబంధాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఆరోపణలపై వార్తల నేపథ్యంలో Nvidia బోర్డు జెన్సన్ హువాంగ్ పైన స్వతంత్ర విచారణ ప్రారంభించింది. అయితే, రాజీనామాకు ఇదే కారణమని కంపెనీ అధికారిక ప్రకటనలో స్పష్టంగా చెప్పలేదు. నిజానికి, ఈ రాజీనామా వెనుక నిజమైన కారణాలు ఏమిటి అని అటు కంపెనీ కానీ ఇటు జెన్సన్ హువాంగ్ కానీ ఎటువంటి వ్యక్తిగత ప్రకటన చేయలేదు. కానీ ఇదే కారణం కావచ్చని ఒక కామెంట్ ఎక్కువగా వినిపిస్తోంది.

కొత్త CEO ఎవరు

Nvidia ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) కోలెట్ క్రెస్‌ కు తాత్కాలిక CEO బాధ్యతలు అప్పగించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త శాశ్వత CEO ను నియమించే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. అదే సమయంలో CFO బాధ్యతలను కూడా నిర్వహిస్తారని కంపెనీ వెల్లడించింది. శాశ్వత CEO ఎంపిక కోసం కంపెనీ లోపలి వారు మరియు బాహ్య అభ్యర్థులను పరిశీలించనున్నట్లు కూడా బోర్డు తెలిపింది. హార్వీ సి. జోన్స్‌ ను బోర్డు తొలి ఛైర్మన్‌ గా నియమించింది.

AI చిప్ ప్రపంచం పై దీని ప్రభావం ఉంటుందా?

ప్రస్తుతం Nvidia చిప్‌ లు ప్రపంచవ్యాప్తంగా AI డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ AI మోడళ్ల శిక్షణలో కీలకంగా ఉపయోగపడుతున్నాయి. Chat GPT వంటి AI సేవలకు అవసరమైన అధిక సామర్థ్య కంప్యూటింగ్ వ్యవస్థల్లో Nvidia GPU లకు ప్రత్యేక స్థానం ఉంది. సంస్థ భవిష్యత్ AI చిప్‌ అభివృద్ధి, సరఫరా వ్యవస్థ మరియు టెక్నాలజీ భాగస్వామ్యాల పై హువాంగ్ నాయకత్వం ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అందువల్ల CEO మార్పు తర్వాత కంపెనీ AI చిప్ రోడ్‌ మ్యాప్, వ్యూహాత్మక నిర్ణయాలు ఎలా కొనసాగుతాయన్నది పరిశ్రమ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చగా మారింది. అయితే, కంపెనీ కార్యకలాపాలు, కస్టమర్ ఒప్పందాలు మరియు ఉత్పత్తుల ప్రణాళికల్లో ఎటువంటి అంతరాయం ఉండదని Nvidia బోర్డు స్పష్టం చేసింది. కాబట్టి, కాలక్రమేణా ఇది తెలిసే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile