Ray-Ban Meta Smart Glasses సూపర్ AI కళ్ళ జోడు ఇండియాలో లాంచ్ అవుతోంది.!
Ray-Ban Meta Smart Glasses సూపర్ AI కళ్లజోడు ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అవుతోంది
ఈ కళ్ళజోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేస్తుంది
జేమ్స్ బాండ్ సినిమాలో చూపించే కళ్ళ జోడు కు ఏమాత్రం తీసిపోని ఫీచర్స్ కలిగి ఉంటుంది
ఇటీవల గ్లోబల్ మార్కెట్లో విడుదలైన Ray-Ban Meta Smart Glasses సూపర్ AI కళ్లజోడు ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అవుతోంది. ప్రముఖ కళ్ల జోళ్ల తయారీ కంపెనీ రేబాన్ మరియు మెటా ఎఐ సంయుక్తంగా అందించిన ఈ కళ్ళజోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేస్తుంది. ఇది చూడటానికి మామూలు కళ్ళ జోడు మాదిరిగా కనిపించే స్మార్ట్ గ్లాసెస్. జేమ్స్ బాండ్ సినిమాలో చూపించే కళ్ళ జోడు కు ఏమాత్రం తీసిపోని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో స్క్రీన్ మొదలు కొని కెమెరా వరకు చాలా ఫీచర్స్ ఉన్నాయి.
SurveyRay-Ban Meta Smart Glasses : లాంచ్
రే-బాన్ మరియు మెటా కలిసి రూపొందించిన ఈ రేబాన్ మెటా కళ్ళజోడు ఇప్పటికే US, UK మరియు యూరప్ దేశాల్లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు నవంబర్ 21వ తేదీ నుంచి ఇండియాలో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త AI గ్లాసెస్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. కొత్త టీజర్ ద్వారా ఈ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసింది. అంటే, ఈ స్మార్ట్ గ్లాసెస్ అమెజాన్ నుంచి సేల్ అవుతుంది.
Ray-Ban Meta Smart Glasses : ఫీచర్స్
ఈ స్మార్ట్ గ్లాసెస్ రేబాన్ క్లాసిక్ డిజైన్ తో ఉంటుంది మరియు మెటా ఎఐ మైండ్ తో జతగా వస్తుంది. ఇది Wayfarer మరియు Skyler లాంటి క్లాసిక్ ఫ్రేమ్‌లలో లభిస్తుంది. ఇది కంట్రోల్ కోసం ప్రత్యేకమైన హైపర్ ప్యాడ్ తో జతగా వస్తుంది మరియు ఇందులో అనేక కంట్రోల్ ఆప్షన్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ మెటా AI ఇంటిగ్రేషన్ తో చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఇది హ్యాండ్ ఫ్రీ కంట్రోల్ కోసం వాయిస్ అసిస్టెంట్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ గ్లాసెస్ ల్యాండ్ మార్క్, తర్జుమా మరియు జనరల్ నాలెడ్జ్ కి రియల్ టైమ్ యాక్సెస్ అందిస్తుంది. ఇది గ్లాస్ పై వీడియోలు, ఇమేజ్ మరియు నోటిఫికేషన్ కోసం గ్లాస్ పై స్క్రీన్ ను అందించింది. అంటే, ఇక్కడ మీ సాధారణ కళ్ల జోడు మీకు స్క్రీన్ చూపించు VRR గ్లాస్ గా మారిపోతుంది. ఇందులో హై క్వాలిటీ 12MP అల్ట్రా వైడ్ కెమెరా సిస్టం ఉంటుంది. ఇది HD వీడియో రికార్డింగ్ మరియు ఫోటోలు చిత్రించే ఫీచర్ తో పాటు QR కోడ్స్ సైతం స్కాం చేసే ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: 10 వేల రూపాయల ZEBRONICS Dolby 5.1 ఛానల్ సౌండ్ బార్ ఈరోజు 7 వేలకే లభిస్తోంది.!
ఈ మెటా ఎఐ స్మార్ట్ గ్లాసెస్ క్వాలిటీ సౌండ్ అందించే ఓపెన్ ఇయర్ స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో గొప్ప సౌండ్ ను కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో 5 మైక్రోఫోన్ అరే మైక్ సెటప్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా మీకు ఈ స్మార్ట్ గ్లాసెస్ కళ్ళ ముందే ప్రపంచాన్ని చూపించే సత్తా కలిగి ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకుంటే మీ ఫోన్ ను జేబులోంచి బయటకు తియ్యకుండా అన్ని పనులు ఈ గ్లాస్ తో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇది సింగల్ ఛార్జ్ తో 4 గంటలు పని చేస్తుంది మరియు ఛార్జింగ్ కేస్ తో 32 గంటల ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.