విక్రమ్ తో సహా OTT పైన తాజాగా స్ట్రీమ్ అవుతున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!!
OTT పైన తాజాగా స్ట్రీమ్ అవుతున్న ఈ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇంకా చూడలేదా
ఈ నెలలో OTT లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి స్ట్రీమ్ అవుతున్నాయి
ఈ నెల ఓటిటి లో సినిమా ప్రియులకు సందడి చేస్తోంది
OTT పైన తాజాగా స్ట్రీమ్ అవుతున్న ఈ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇంకా చూడలేదా? అయితే, వెంటనే చూసేయండి. ఈ నెలలో OTT లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి స్ట్రీమ్ అవుతున్నాయి. వీటిలో, అడివి శేష్ 'మేజర్' మరియు కమల్ హాసన్ 'విక్రమ్' రెండు కొత్త మరియు బ్లాక్ బాస్టర్ వినిమాలు కూడా వున్నాయి. ఈ నెల ఓటిటి లో సినిమా ప్రియులకు సందడి చేస్తోంది. OTT పైన తాజాగా స్ట్రీమ్ అవుతున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు పైన ఒక లుక్ వేద్దామా.
SurveyVikram
బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించిన కమల్ హాసన్ బ్లాక్ బాస్టర్ మూవీ 'విక్రమ్' ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈరోజు నుండి ఈ సినిమా Disney+ Hotstar నుండి స్ట్రీమ్ అవుతోంది. చాలాకాలం తరువాత కమల్ హాసన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్ సినిమాగా 'Vikram' ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తమిళ నాట బాహుబలి సినిమా కలక్షన్ రికార్డ్ ను సైతం వెనక్కు నెట్టింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపు దిద్దుకుంది.
Major
అడివి శేష్ అద్భుత నటనా చిత్రం 'మేజర్' OTT లో జూన్ 3 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా Netflix నుండి స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా 26/11 ముంబై దాడిలో వీర మరణం పొందిన 'సందీప్ ఉన్ని కృష్ణన్' జీవిత వృత్తాంతాన్ని (బయో పిక్) సినిమాగా నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో వుంది మరియు 26/11 ముంబై దాడి కధానాలను కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా, శశి కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
విరాట పర్వం
దగ్గుబాటి రానా మరియు సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' జూలై 1 నుండి OTT లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో కథ, సన్నివేశాలు మరియు తారల నటన వంటి అన్ని అంశాల్లో కూడా మంచి పాజిటీవ్ టాక్ అందుకుంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన కలక్షన్లను సాధించలేక పోయింది. ఈ సినిమా కూడా Netflix నుండి స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా చూడలేక పోయిన వారు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడవచ్చు.
పృథ్వీరాజ్
సామ్రాట్ పృథ్వీ రాజ్ చౌహన్ జీవితం ఆధారంగా నిర్మిచిన చారిత్రక యాక్షన్ డ్రామా సినిమా ఈ 'సామ్రాట్ పృథ్వీ రాజ్'. పృథ్వీ రాజ్ చౌహన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించగా సంజయ్ దత్ మరియు సోనూ సూద్ ప్రధాన పాత్రలను పోషించారు. జూన్ 3 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా Prime Video నుండి స్ట్రీమ్ అవుతోంది.