New Scam Alert: పెళ్లి కార్డు ముసుగులో కొత్త స్కామ్ లకు తెరలేపిన స్కామర్లు.!

HIGHLIGHTS

ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యింది

కార్తీకమాసం వచ్చిందంటే పెళ్లిళ్ల సీజన్ మొదలైనట్లే

పెళ్లిళ్ల సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి స్కామర్లు కొత్త స్కామ్ కు తెరలేపారు

New Scam Alert: పెళ్లి కార్డు ముసుగులో కొత్త స్కామ్ లకు తెరలేపిన స్కామర్లు.!

New Scam Alert: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యింది. కార్తీకమాసం వచ్చిందంటే పెళ్లిళ్ల సీజన్ మొదలైనట్లే. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో ఈ సీజన్ లో పెళ్లిళ్లు జరగనున్నాయని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇంకేముంది, ఈ పెళ్లిళ్ల సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి స్కామర్లు కొత్త స్కామ్ కు తెరలేపారు. పెళ్లి పిలుపుకు ముఖ్య అవసరమైన పెళ్లి కార్డుతో ఈ కొత్త స్కామ్ ను చేనున్నారు. మరి ఈ కొత్త స్కామ్ మరియు దీని నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా New Scam Alert ?

2024 పెళ్లిళ్ల సీజన్ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. నంబర్ మరియు డిసెంబర్ నెలల్లో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరపడానికి డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అందుకే, స్కామర్లు ఈ పెళ్లిళ్ల సీజన్ ను టార్గెట్ చేశారు. ఒకప్పుడు పెళ్లి అనగానే నెల రోజుల ముందుగానే పెళ్లి కార్డ్ లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వారు. అయితే, ఇప్పుడు ఆన్లైన్ పుణ్యమా అని వాట్సాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో పెళ్లి కార్డ్స్ పంపించేస్తున్నారు.

New Scam Alert

సరిగ్గా ఇదే విషయాన్ని టార్గెట్ చేసిన స్కామర్లు పెళ్లి కార్డుల ముసుగులో స్కామ్ లకు తెర లేపారు. చూడటానికి అచ్చంగా పెళ్లి కార్డు మాదిరిగా కనిపించే APK ఫైల్స్ ను పంపిస్తున్నారు. ఇది పెళ్లి ఇన్విటేషన్ అనుకోని దీని డౌన్ లోడ్ చేసుకొని యూజర్లు వారి ఫోన్ యాక్సెస్ ను స్కామర్ల చేతికి ఇస్తున్నారు.

ఒక్కసారి ఈ APK ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుంటే, అది స్కామర్ లకు యూజర్ యొక్క డివైజ్ ఫుల్ యాక్సెస్ ఇస్తుంది. అంటే, ఎక్కడి నుంచైనా స్కామర్లు ఈ ఫోన్ లేదా డివైజ్ ను అదుపు చేయగలుగుతారు.

ఈ స్కామ్ ఎలా చేస్తారు?

ఈ స్కామ్ ను చాలా సింపుల్ గా మరియు నమ్మశక్యంగా చేస్తారు. ముందుగా తెలియని నెంబర్ నుంచి పెళ్లి కార్డ్ తో కూడిన ఒక ఫైల్ మెసేజ్ ను పంపిస్తారు. ఇది జెన్యూన్ మ్యారేజ్ కార్డ్ అని మిమ్మల్ని నమ్మించేలా ఉంటుంది. దీన్ని చూసి మీకు ఎటువంటి అనుమానం కలగదు.

అయితే, వాస్తవానికి ఇది వైరస్ లేదా కంట్రోల్ కోడ్స్ తో కూడిన APK ఫైల్ మరియు ఇది దీన్ని డౌన్లోడ్ చేసుకోగానే మీ ఫోన్ ను తన ఆధీనంలోకి తీసుకుంటుంది.

Also Read: Redmi A4 5G టాప్ 5 ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి?

ఈ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ప్రధాన మార్గం, మీకు తెలుయని వారి నుంచి వచ్చే మెసేజ్ లేదా ఫైల్స్ ను డౌన్ లోడ్ చేయకపోవడం. మరి ముఖ్యంగా మీకు తెలియని కొత్తవారు లేదా Unknown నెంబర్ నుంచి ఆహ్వానం కనుక వస్తే దాన్ని డౌన్ లోడ్ చేయకపోవడం ఉత్తమం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo