Redmi A4 5G టాప్ 5 ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

Redmi A4 5G టాప్ 5 ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

Redmi A4 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఇదే నెలలో లాంచ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ అప్ కమింగ్ షియోమీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ను ముందే తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi A4 5G : లాంచ్

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో నవంబర్ 20వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతోందని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ను కూడా కంపెనీ ముందే వెల్లడించింది.

Redmi A4 5G Top Features

Redmi A4 5G : టాప్ 5 ఫీచర్స్

స్క్రీన్

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.88 ఇంచెస్ స్క్రీన్ ను పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది

ప్రోసెసర్

ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫోన్ Snapdragon 4s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ తో ఈ చిప్ సెట్ గ్లోబల్ డెబ్యూట్ గా వస్తోంది.

కెమెరా

ఈ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు కనిపించే డిజైన్ తో అందించింది. అయితే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మాత్రమే వుంది. ఇందులో 50MP AI డ్యూయల్ కెమెరా సెటప్ వుంది.

డిజైన్

ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం హేలో గ్లాస్ మరియు శాండ్విచ్ డిజైన్ తో లాంచ్ చేస్తునట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా గొప్ప లుక్స్ తో కనిపిస్తోంది.

Also Read: Canva Down: కొండెక్కిన కాన్వా సైట్.. లాగిన్ సమస్యలు రిపోర్ట్ చేస్తున్న యూజర్లు.!

బ్యాటరీ

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ 5,160 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతున్నట్లు షియోమీ ప్రకటించింది.

ఈ టాప్ ఫీచర్స్ తో ఈ రెడ్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కోసం సిద్ధం అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile