Lava Virat Curve ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Lava Virat Curve ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది

ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఈ కొత్త ఫోన్ ని లావా లాంచ్ చేసింది.

ఈ ఫోన్ లో వెనుక ప్రత్యేకమైన Mini Screen స్క్రీన్ ని లావా అందించింది

Lava Virat Curve ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Lava Virat Curve ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ప్రైస్ లో అనేక స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసిన ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా, ఈరోజు ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఫీచర్స్ మరియు లాంచ్ ఆఫర్లు వంటి కంప్లీట్ ఇన్ఫో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Virat Curve : ప్రైస్

లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 23,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం 6GB +128GB వేరియంట్ సింగల్ ఈ ప్రైస్ తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ తో గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది.

ఆఫర్స్ అండ్ సేల్

ఈ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను లావా అనౌన్స్ చేసింది. ఫస్ట్ డే సేల్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికోసం ఈ బిగ్ డీల్స్ అందించింది. ఫస్ట్ డే సేల్ నుంచి ఫోన్ ని మేజర్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 4,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ మొదటి రోజు కేవలం రూ. 19,999 ఆఫర్ ధరకే మీకు లభిస్తుంది. ఇది నిజంగా జబర్దస్త్ డీల్స్ అవుతుంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ను సేల్ చేస్తునట్లు లావా అనౌన్స్ చేసింది.

Lava Virat Curve : ఫీచర్స్

లావా ఈ ఫోన్ ను వేగాన్ లెథర్ తో చాలా ప్రీమియం అండ్ స్లీక్ డిజైన్ తో విడుదల చేసింది. ఇందులో, ప్రీమియం 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లే అందించింది. ఈ డిస్ప్లే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, FHD + రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది., ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7100 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ తో జతగా 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB వర్చువల్ ర్యామ్ అందించింది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కూడా వివో అందించింది.

ఈ లావా ఫోన్ లో వెనుక 50MP SONY IMX 752 ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ 30FPS తో 2K వీడియో రికార్డింగ్ అందిస్తుంది. ఇందులో 4K వీడియో రికార్డింగ్ లేకపోవడం పెద్ద లోతుగా చెప్పొచ్చు. అయితే, ఇది లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన లావా కెమెరా ఫీచర్స్ కలిగి ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది.

Lava Virat Curve Features

అదనపు స్క్రీన్, ఈ ఫోన్ లో వెనుక ప్రత్యేకమైన Mini Screen స్క్రీన్ ని లావా అందించింది. ఇది ఈ ఫోన్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇందులో నోటిఫికేషన్, మ్యూజిక్, బ్యాటరీ, ఎమోజీ, వాల్యూమ్ వంటి మరిన్ని వివరాలు డిస్ప్లే చేస్తుంది. ఈ ఫోన్ ను 6000 mAh భారీ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. అయితే, ఫోన్ తో పాటు కేవలం 33W ఫాస్ట్ ఛార్జ్ ఛార్జర్ ని మాత్రమే ఆఫర్ చేసింది.

Also Read: Dussehra Sale సందడి మొదలైంది : భారీ ఆఫర్స్ తో పండుగ సేల్ అనౌన్స్ చేసిన Amazon మరియు Flipkart

ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ మరియు డ్యూయల్ మైక్ ని కూడా ఆఫర్ చేసింది. ఈ ఫోన్ MIL-STD 810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఇది బ్లోట్ వేర్ లేని ఆండ్రాయిడ్ 16 OS తో అవుట్ ఆఫ్ డి బాక్స్ పని చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 2 సంవత్సరాల OS అప్‌గ్రేడ్ మరియు 3 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile