Canva Down: కొండెక్కిన కాన్వా సైట్.. లాగిన్ సమస్యలు రిపోర్ట్ చేస్తున్న యూజర్లు.!

HIGHLIGHTS

గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ ఫామ్ Canva ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయ్యింది

ప్రపంచం నలుమూలల నుంచి యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు

#Canva is Down అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు X (ఒకప్పటి ట్విట్టర్) లో ట్రెండ్ గా మారింది

Canva Down: కొండెక్కిన కాన్వా సైట్.. లాగిన్ సమస్యలు రిపోర్ట్ చేస్తున్న యూజర్లు.!

Canva Down: అత్యంత ప్రజాదరణ పొందిన గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ ఫామ్ Canva ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయ్యింది. ఈ ప్లాట్ ఫామ్ పై లాగిన్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రపంచం నలుమూలల నుంచి యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, #Canva is Down అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు X (ఒకప్పటి ట్విట్టర్) లో వైరల్ గా మారింది. కేవలం ఈ ఒక్క హ్యాష్ ట్యాగ్ మాత్రమే కాదు కాన్వా డౌన్ ను గురించి యూజర్లు కొత్త కొత్త హ్యాష్ ట్యాగ్ లను కూడా గుప్పిస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Canva Down

కాన్వా డౌన్ అయినా విషయం X అకౌంట్స్ నుంచి అక్కడక్కడ రిపోర్ట్ అయినా, వాస్తవానికి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ సర్వీస్ ను ట్రాక్ చేసే ప్లాట్ ఫామ్ Downdetector ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా బయటకు వచ్చింది. ఈ ప్లాట్ ఫామ్ పై వందల కొద్దీ కంప్లైంట్ లు రిపోర్ట్ అయ్యాయి మరియు X ప్లాట్ ఫామ్ పై మరింత ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు.

Canva Down

X పై వస్తున్న ట్రోల్స్ ను బట్టి చూస్తుంటే, కాన్వా పని చేయని యూజర్లలో దాదాపు 95 శాతం మంది లాగిన్ సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాదు, యూజర్లు వారి సమస్యలు తెలుపడమే కాకుండా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా తెలిపారు.

ఇక X అకౌంట్ నుంచి ఎక్కువగా ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ లను గమనిస్తే, #Canva is down, #canvadown అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ అయ్యింది. ఇది కాకుండా @canva is down. please fix immediately అని కూడా విన్నవించారు.

Also Read: విడ్డూరం: 100 మంది పిల్లలకు తండ్రైన Telegram CEO.. ఉచిత IVF ప్రకటన కూడా అనౌన్స్.!

ఇమేజ్ క్రియేటర్స్ మరియు రెగ్యులర్ యూజర్లు ఈ సమస్యతో అసహనానికి గురైనట్లు చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile