డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చెయ్యాలనుకుంటున్నారా.. మీ కోసం గుడ్ న్యూస్..!!

డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చెయ్యాలనుకుంటున్నారా.. మీ కోసం గుడ్ న్యూస్..!!
HIGHLIGHTS

వాహనాన్ని నడిపే ప్రతీ ఒక్కరి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలి

ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది

కొత్త నియమాల వలన డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా తేలికగా మారింది

రీసెంట్ గా ప్రభుత్వ అమలులోకి తీసుకువచ్చిన కొత్త నియమాల వలన డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా తేలికగా మారింది. అంటే, కొత్త రూల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే వారికి సౌకర్యవంతంగా వుండేలా ఉంటాయి. వాహనాన్ని నడిపే ప్రతీ ఒక్కరి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలి. అయితే, ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా రోజులు క్యూలో నిలిబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభంగా మారింది. మరింత సౌకర్యమైన విషయం ఏంటంటే, దీనికోసం మీరు RTO ఆఫీస్ కు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కోసం నమోదు చేసుకోవచ్చు.

కొత్తగా లైసెన్స్ కోసం అప్లై చేసే లెర్నర్స్ తమ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవర్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తిచేయగాలిగితే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTO (ప్రాంతీయ రవాణా కార్యాలయం) నుండి డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది.

అయితే, గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్ మరియు గుర్తింపు పొందిన ఏజెన్సీలు ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు కనీసం ఒక ఎకరం భూమి ఉండేలా చూడాలి. అదేవిధంగా, భారీ వాహనాలు మరియు కార్గో ట్రక్కుల ట్రైనింగ్ స్కూల్స్ కు 2 ఎకరాల స్థలం అవసరం .ఇంకో ముఖ్యమైన అవసరం ఏమిటంటే, ఎగ్జామినర్ కనీసం 12 తరగతి పాస్‌ కలిగి ఉండాలి .డ్రైవింగ్ స్కూల్స్ కి ఇలాంటి అనేక షరతులు ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌ లో ఎలా పొందాలి?

1. RTO వద్ద ఫిజికల్ టెస్ట్ కి బదులుగా, ఇప్పుడు మీరు ఆన్‌లైన్ టెస్ట్ కోసం హాజరుకావచ్చు.

2. ఆన్‌లైన్ టెస్ట్ ఆడిట్ కోసం ఎలక్ట్రానికల్ గా రికార్డ్ చేయబడుతుంది.

3. భారతీయ రహదారి రంగంలో మంచి డ్రైవర్ల కొరత కారణంగా కొత్త నిబంధనలు అమలు చేయబడ్డాయి. ఇది రహదారి నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలకు కారణమవుతుంది.

4. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో లొసుగులను తగ్గించడానికి దరఖాస్తుదారుల ఆన్‌లైన్ పరీక్ష అమలు చేయబడుతోంది.

5. ఆన్‌లైన్ డ్రైవింగ్ టెస్ట్ ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ కంటే సమర్థవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

6. డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది.

7. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, అది ఆటొమ్యాటిగ్గా సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo