Nano Banana vs Nano Banana 2: కొత్త అప్డేట్ తో ప్రధాన మార్పులు ఏమిటి?

HIGHLIGHTS

Nano Banana vs Nano Banana 2 కొత్త వెర్షన్ అప్డేట్

మొదటి వెర్షన్‌తో పోలిస్తే రెండో జనరేషన్‌ వెర్షన్ లో మరిన్ని కొత్త మార్పులు వచ్చాయి

గూగుల్ కొత్తగా Nano Banana 2 ఫీచర్ ను కూడా విడుదల చేసింది

Nano Banana vs Nano Banana 2 : ఇమేజ్ ను మరింత హంగులతో సరికొత్త రూపంలో ఇమేజ్ లను అందించడం మొదలుకొని ఊహలకు రూపం ఇచ్చే ఇంజె క్రియేషన్ వరకు క్రియేషన్ చేయడం నానో బనానా ప్రత్యేకత. నానో బనానా సాధించిన సక్సెస్ ను మరింత ముందుకు కొనసాగించే ఆలోచనతో ఇప్పుడు గూగుల్ కొత్తగా Nano Banana 2 ఫీచర్ ను కూడా విడుదల చేసింది. మొదటి వెర్షన్‌తో పోలిస్తే రెండో జనరేషన్‌ వెర్షన్ లో మరిన్ని కొత్త మార్పులు వచ్చాయి. ఈరోజు ఈ కొత్త వెర్షన్ అప్‌డేట్ మరియు పాత వెర్షన్ తో పోలిస్తే ఈ వెర్షన్ ఎటువంటి అదనపు ఫీచర్స్ కలిగి ఉందో తెలుసుకుందాం.

Nano Banana vs Nano Banana 2:

నానో బనానా అనేది Google యొక్క AI ఇమేజ్ జనరేషన్ మోడల్ మరియు గొప్ప ఇమేజస్ క్రియేట్ చేస్తున్న బెస్ట్ ఏఐ మోడల్ గా యూజర్ల నుంచి కితాబు అందుకుంది. ఇప్పుడు ఈ బెస్ట్ ఇమేజ్ క్రియేట్ ఏఐ మోడల్ యొక్క అప్డేట్ వెర్షన్ ను గూగుల్ అందించింది. అదే, గూగుల్ జెమినీ నానో బనానా 2 వెర్షన్. ఈ కొత్త వెర్షన్ పాత మోడల్ కంటే మంచి మెరుగుదల కలిగి ఉంటుంది.

స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్

నానో బనానా సూపర్ ఫాస్ట్ గా ఇమేజ్ జనరేషన్ చేసి అందిస్తుంది. అయితే, నానో బనానా 2 మరింత వేగంగా మరియు ఫ్లాష్-లైన్-స్టైల్ స్పీడ్ లో పనిచేస్తుంది. అంతేకాదు, అదనపు క్లిష్టమైన ప్రాంప్ట్ లను సైతం చాలా తేలికగా హ్యాండిల్ చేసే శక్తి కలిగి ఉంటుంది.

ఇన్ స్ట్రక్షన్ ఫోలో చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది

నానా బనానా సాధారణ ప్రాంప్ట్ తో చిత్రాన్ని బాగా క్రియేట్ చేస్తుంది. అయితే, కొన్ని క్లిష్టమైన ప్రాంప్ట్ సమయంలో తటపటాయిస్తుంది. అయితే, నానా బనానా 2 మాత్రం కాంప్లెక్స్ లేదా సూక్ష్మ సూచనలను కూడా బాగా అర్థం చేసుకొని ఇన్స్ట్రక్షన్ ఫోలో చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అంటే, ఇది క్లిష్టమైన ప్రాంప్ట్ తో కూడా అద్భుతమైన ఇమేజెస్ క్రియేట్ చేయగలదు.

క్యారెక్టర్ అండ్ వస్తువుల స్థిరత్వం

నానో బనానా ఒకే చిత్రంలో కొన్ని అంశాలను మాత్రమే కలప గలదు. అయితే, నాలో`నానో బనానా మాత్రం ఒకే సమయంలో గరిష్టంగా 5 పాత్రలు మరియు 14 వస్తువుల అస్థిత్వాన్ని స్థిరంగా ఉంచగలదు.

టెక్స్ట్ అండ్ భాష సపోర్ట్

నానో బనానా అందించే ఇమేజ్ లో టెక్స్ట్ జనరేషన్‌ ఉండొచ్చు కానీ పరిమితి ఉంటుంది. కానీ నానో బనానా 2 మాత్రం స్పష్టమైన మరియు చదవగలిగే టెక్స్ట్ లతో ఇమేజ్ సృష్టిస్తుంది. అంటే, ఇది అనువాద ఇమేజ్ క్రియేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది.

Also Read: Flipkart బిగ్ డీల్: కేవలం 18 వేలకే 43 ఇంచ్ Samsung 4K Smart Tv అందుకోండి.!

4K ఇమేజ్ చిత్రించే సామర్థ్యం

నానో బనానా మోడల్ కేవలం సాధారణ లేదా 2K లేదా అంత కంటే తక్కువ ఇమేజ్ క్రియేషన్ కోసం సపోర్ట్ చేస్తుంది. అయితే, నానో బనానా 2 మాత్రం 512px నుండి 4K రిజల్యూషన్ వరకు హై ఎండ్ ఇమేజ్ క్రియేషన్ కు సపోర్ట్ చేస్తుంది.

నానో బనానా 2 ప్రముఖ వెబ్ సెర్చ్, సాంకేతిక రియల్ వరల్డ్ డేటా, ప్రపంచ జ్ఞానం నుండి ఇమేజ్ కోసం ఇన్స్పిరేషన్ తీసుకొని ఆబ్జెక్ట్ రెండరింగ్ ని మరింత కచ్చితంగా నిర్మిస్తుంది. అందుకే, ఈ కొత్త గూగుల్ జెమినీ కొత్త మోడల్ మరింత కచ్చితమైన మరియు అద్భుతమైన ఇమేజెస్ క్రియేట్ చేసే శక్తి కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :