Mothers Day 2026 Wishes and images to send for mothers day celebration
Mothers Day 2026 Wishes: అమ్మ అనే ఒక్క మాటలో ప్రేమ, త్యాగం, మమత, భద్రత అన్నీ దాగి ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి గురువు మరియు మొదటి ఫ్రెండ్ అమ్మ మాత్రమే అవుతుంది. అటువంటి త్యాగ మూర్తి కోసం ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు. 2026 లో మదర్స్ డే మే 10న జరుపుకుంటున్నారు. అంటే, రేపు ఆదివారం 2026 మదర్స్ డే గా మనం జరుపుకుంటాము. ఈ ప్రత్యేక రోజున మీ అమ్మకు మీ ప్రేమను తెలియజేయడానికి తెలుగులో బెస్ట్ మదర్స్ డే విషెస్, మెసేజెస్ మరియు స్టేటస్ లైన్స్ తో పాటు బెస్ట్ ఇమేజెస్ కూడా అందించాము.
అమ్మ ప్రేమకు కొలమానం లేదు, నా జీవితంలో గొప్ప వరం నువ్వే అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ
నా జీవితంలో ప్రతి విజయానికి కారణం నువ్వే అమ్మ…హ్యాపీ మదర్స్ డే అమ్మ
ప్రపంచంలో స్వార్ధం లేని ప్రేమ ఒక్క అమ్మదే.. నీ ప్రేమ వెలకట్టలేనిది అమ్మ
అమ్మ నవ్వు ఇంటి ఆనందం, నువ్వు లేకుంటే ఈ ఇల్లు బోసిపోతుంది.. హ్యాపీ మదర్స్ డే అమ్మ
నువ్వు ఉన్నావనే ధైర్యమే నా బలం అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ
అమ్మ ప్రేమ ఎప్పటికీ తగ్గదు… కాలం మారినా ఆమె మమత మారదు, ప్రతి తల్లికి హ్యాపీ మదర్స్ డే
నా జీవితంలో నిజమైన హీరో నా అమ్మే, నీ జీవితంలో ప్రతిదీ అమ్మ ఇచ్చిందే.. హ్యాపీ మదర్స్ డే అమ్మ
అమ్మ చేతి వంట… అమ్మ ప్రేమ… ఇవి ప్రపంచంలోనే ది బెస్ట్.. తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే
నా కష్టాల్లో అండగా నిలిచింది నువ్వే అమ్మ… నిన్ను ఎంత ప్రేమించినా తక్కువే, హ్యాపీ మదర్స్ డే
నేను పడిపోయినప్పుడు లేపింది నీ చేయి, నేను ఏడ్చినప్పుడు ఓదార్చింది నీ మాట, నువ్వు లేకుంటే నేను లేను అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ
దేవుడిని చూడకపోయినా అమ్మలో దేవుణ్ణి చూస్తాను, అందరికీ ప్రపంచ మదర్స్ డే 2026 శుభాకాంక్షలు
అమ్మంటే అంతులేని ప్రేమ, నా జీవితానికి వెలుగు అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ
అమ్మ ఒడిలోనే నిజమైన ప్రశాంతత ఉంటుంది, ఎన్ని జన్మలు వచ్చినా నీ బిడ్డగానే పుట్టాలి, హ్యాపీ మదర్స్ డే అమ్మ
అమ్మ చేసిన త్యాగాలకు జీవితాంతం రుణపడి ఉంటాం, అందరికీ ప్రపంచ మదర్స్ డే 2026 శుభాకాంక్షలు
అమ్మ ఆశీర్వాదం ఉంటే అసాధ్యం అనేది ఉండదు, మదర్స్ డే 2026 శుభాకాంక్షలు
మథర్స్ డే అనేది కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, అమ్మ చేసిన త్యాగాలకు కృతజ్ఞత చెప్పే ఒక గొప్ప రోజు. అందుకే, ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు ప్రేమను తెలియజేయండి. ఎందుకంటే, ఆమె ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు.
Also Read: నెవర్ బిఫోర్ ఆఫర్: ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ను 6 వేలకే అందుకోండి.!