Maha shivaratri 2025 కోసం ప్రియమైన వారికి షేర్ చేయదగిన బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ ఇమేజెస్.!
Maha shivaratri 2025 పర్వదినం వచ్చేసింది
తెలుగు వారికి అత్యంత ప్రియమైన పండుగలలో ‘మహాశివరాత్రి’ కూడా ఒకటి
మహా శివరాత్రి నాడు ఉపవాసం మరియు శివసన్నిధిలో సమయం గడపడం మంచిది
Maha shivaratri 2025 పర్వదినం వచ్చేసింది. తెలుగు వారికి అత్యంత ప్రియమైన పండుగలలో ‘మహాశివరాత్రి’ కూడా ఒకటి. ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులు కావడానికి మహా శివరాత్రి నాడు ఉపవాసం మరియు శివసన్నిధిలో సమయం గడపడం మంచిదని భావిస్తారు. అంతేకాదు, ఈ పండుగ అందరికి సుఖ సొంతోషాలు తీసుకురావాలని కూడా ఆ ఈశ్వరుని అర్థిస్తారు. అందుకే, ఈ పండుగ నాడు మీ ప్రియమైన వారికి పంపదగిన బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ ఇమేజెస్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.
SurveyMaha shivaratri 2025 : బెస్ట్ విషెస్
ఓం నమః శివాయ! మీకు మరియు మీ కుటుంబానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలి!
అతి పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున, ఆ శివుడు మీకు జ్ఞానాన్ని మరియు శక్తిని ప్రసాదించుగాక, శుభ శివరాత్రి!
ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు!
శివయ్య లేని చోటేది, మీ మనసులో, నా మనసులో, మన అందరి మనస్సులో ఆయన కొలువై ఉన్నాడు. ఈ శివరాత్రి ఆ శివుని ప్రేమకు మీరు పాత్రలు కావాలని ఆశిస్తూ, మాహాశివరాత్రి 2025 శుభాకాంక్షలు.
ఈ శివరాత్రి పర్వదినాన మీ ఇంట శాంతి మరియు సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి 2025 శుభాకాంక్షలు.
ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండటం వలన మీ పాపాలు తొలగిపోవాలని మరియు మీకు మోక్షం కలగాలని కోరుకుంటూ, మహాశివరాత్రి శుభాకాంక్షలు!
శివయ్య నామస్మరణతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, మీకు మహాశివరాత్రి 2025 శుభాకాంక్షలు.!
Also Read: Jio Hotstar ఉచితంగా ఆఫర్ చేసే జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
Maha shivaratri 2025 : బెస్ట్ ఇమేజెస్


