Realme P4 Lite: రియల్‌మీ బడ్జెట్ బిగ్ బ్యాటరీ ఫోన్ ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

రియల్‌మీ బడ్జెట్ బిగ్ బ్యాటరీ ఫోన్ ఫస్ట్ సేల్ రేఫు స్టార్ట్ అవుతుంది

Realme P4 Lite మిలిటరీ గ్రేడ్ స్ట్రాంగ్ డిజైన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది

ఈ ఫోన్ చాలా చవక ధరలో 6300mAh బిగ్ బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది

Realme P4 Lite: రియల్‌మీ బడ్జెట్ బిగ్ బ్యాటరీ ఫోన్ ఫస్ట్ సేల్.!

Realme P4 Lite : రియల్‌మీ బడ్జెట్ బిగ్ బ్యాటరీ ఫోన్ ఫస్ట్ సేల్ రేఫు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ గత వారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు రేపు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ చాలా చవక ధరలో 6300mAh బిగ్ బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ మరియు మిలిటరీ గ్రేడ్ స్ట్రాంగ్ డిజైన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కంటే ముందు ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4 Lite: ప్రైస్ అండ్ సేల్

రియల్‌మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4 జీబీ + 64 జీబీ) ను రూ. 7,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 9,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను బీచ్ గోల్డ్, ఒడీసియన్ బ్లాక్ మరియు సీ బ్లూ మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ చేస్తుంది.

Realme P4 Lite: ఫీచర్స్

ఈ రియల్‌మీ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 7.94mm సన్నని డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.74 ఇంచ్ HD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 563 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ కలిగిన అతి సన్నని డిజైన్ లో కూడా పెద్ద 6300mAh బ్యాటరీ కలిగి ఉంది. అంతేకాదు, రియల్‌మీ పి4 లైట్ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జ్ మరియు 6W రివర్స్ ఛార్జ్ ఫీచర్ తో కూడా వస్తుంది.

Realme P4 Lite First sale

ఈ రియల్‌మీ కొత్త ఫోన్ మీడియాటెక్ Helio G99 ప్రోసెసర్ తో నడుస్తుంది. ఇది 4జి చిప్ సెట్ మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ టోటల్ 18 జీబీ వరకు డైనమిక్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటుంది మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంది. సేఫ్టీ పరంగా, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో కూడా వస్తుంది.

Also Read: BSNL Super Plan: అధిక లాభాలు అందించే బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది.!

ఈ ఫోన్ 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో AI కెమెరా ఫీచర్స్ మరియు HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఈ రియల్‌మీ ఫోన్ 300% ఆడియో ఫీచర్ మరియు కూడా ఉంది. ఈ ఫోన్ రియల్‌మీ లేటెస్ట్ UI పై ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అవుతుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo