Motorola Edge 70 Fusion ఇండియా లాంచ్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన మోటోరోలా.!
Motorola Edge 70 Fusion ఇండియా లాంచ్ గురించి ఈరోజు అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా ఈ ఫోన్ టీజర్ లో భాగంగా మోటోరోలా వెల్లడించింది
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ విలాసవంతమైన ఫ్యాబ్రిక్ ఫినిష్ డిజైన్ తో ఉంటుంది
Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి ఈరోజు అనౌన్స్ చేసింది. ఇటీవల సిగ్నేచర్ సిరీస్ నుండి కొత్త ఫోన్ విడుదల చేసిన మోటోరోలా ఇప్పుడు ఎడ్జ్ 70 సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా ఈ ఫోన్ టీజర్ లో భాగంగా మోటోరోలా వెల్లడించింది.
SurveyMotorola Edge 70 Fusion : లాంచ్ డేట్?
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ అండ్ కీలక ఫీచర్స్ గురించి వెల్లడించింది.
Motorola Edge 70 Fusion : కీలక ఫీచర్స్
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ విలాసవంతమైన ఫ్యాబ్రిక్ ఫినిష్ డిజైన్ తో ఉంటుంది. ఇది పాంటోన్ క్యురేటెడ్ కలర్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన డిస్ప్లే గురించి కూడా ఫ్లిప్ కార్ట్ గొప్పగా చెబుతోంది. అదేమిటంటే, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ మరియు ట్రూ కలర్ ఫీచర్స్ కలిగిన క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ విలక్షణ ఫీచర్స్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ ఇదే అని మోటోరోలా ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెబుతోంది.

కేవలం డిస్ప్లే మాత్రమే కాదు ఈ ఫోన్ కెమెరా కూడా ప్రత్యేకమైన సెటప్ కలిగి ఉంటుందని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ 50MP Sony LYT 710 కెమెరా తో వచ్చే ప్రపంచపు మొదటి ఫోన్ ఇదే అని మోటోరోలా ఈ ఫోన్ కెమెరా గురించి తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ ఎడ్జ్ సిరీస్ ఫోన్స్ లో ఎన్నడూ లేని విధంగా 7000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అవుతోంది.
Also Read: Kodak బిగ్ Mini QD Smart Tv ని సూపర్ సౌండ్ సెటప్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది.!
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 7s Gen 4 తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కలిగిన ఈ కీలక వివరాలు మోటోరోలా ఇప్పటికే బయటకు వెల్లడించింది. ఇది 1.1 మిలియన్ నుంచి 1.3 మిలియన్ వరకు AnTuTu స్కోర్ అందించే 4nm టెక్నాలజీ చిప్ సెట్. ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని కీలక వివరాలు కూడా త్వరలోనే మోటోరోలా వెల్లడిస్తుంది. ఈ ఫోన్ మరిన్ని అప్‌డేట్స్ తో మల్లి కలుద్దాం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile