Jio Hotstar ఉచితంగా ఆఫర్ చేసే జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ ఇవే.!

HIGHLIGHTS

Jio Hotstar ఉచితంగా ఆఫర్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు Champions Trophy 2025 Live ఉచితంగా చూడవచ్చు

Jio Hotstar ఉచితంగా ఆఫర్ చేసే జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ ఇవే.!

Jio Hotstar ఉచితంగా ఆఫర్ చేసే జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు Champions Trophy 2025 Live ఉచితంగా చూడవచ్చు. ఇది మాత్రమే కాదు లేటెస్ట్ సిరీస్, సినిమా మరియు మరింత ఎంటర్టైన్మెంట్ కూడా ఆనందించవచ్చు. అందుకే, ఈరోజు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించే ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోనున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Hotstar ఉచితంగా అందించే Jio ప్లాన్స్ ఏమిటి?

రిలయన్స్ జియో యొక్క కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్నాయి. ఇందులో జియో రూ. 196 డేటా ప్యాక్ మరియు జియో 949 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి.

జియో రూ. 196 డేటా ప్యాక్

ఈ జియో డేటా ప్యాక్ 15GB డేటా అందిస్తుంది మరియు 90 రోజుల జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తుంది.

రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 84 రోజుల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ మరియు 84 రోజులు డైలీ 2GB హై స్పీడ్ డేటా కూడా అందిస్తుంది.

Jio Hotstar Plans

Jio Hotstar ఉచితంగా అందించే Airtel ప్లాన్స్ ఏమిటి?

ఎయిర్టెల్ రూ. 398 రూపాయల ప్లాన్, రూ. 1,029 ప్లాన్ మరియు రూ. 3,999 మూడు ప్రీపెయిడ్ ప్లాన్ లతో జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తోంది.

ఎయిర్టెల్ రూ. 3,999 ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు 365 రోజుల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100SMS వినియోగ బెనిఫిట్ లను కూడా పొందవచ్చు.

ఎయిర్టెల్ రూ. 1,029 ప్లాన్

ఈ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా, అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100SMS వినియోగ బెనిఫిట్ తో పాటు మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. అంతేకాదు Apollo 24/7 మెంబర్ షిప్ మరియు ఫ్రీ హలో ట్యూన్స్ కూడా అందిస్తుంది.

Also Read: OnePlus 12R పై బిగ్ డీల్ అందించి వన్ ప్లస్.. చవక ధరకే లభిస్తున్న ప్రీమియం ఫోన్.!

ఎయిర్టెల్ రూ. 398 ప్లాన్

ఈ ప్లాన్ 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 2GB డేటా మరియు 100SMS లతో పాటు 28 రోజుల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ. 160 ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డేటా ఓన్లీ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 5GB డేటా మరియు 7 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. అయితే, మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఈ ప్లాన్ తో అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo