OnePlus 12R పై బిగ్ డీల్ అందించి వన్ ప్లస్.. చవక ధరకే లభిస్తున్న ప్రీమియం ఫోన్.!
OnePlus 12R స్మార్ట్ ఫోన్ రోజు గొప్ప డిస్కౌంట్ లతో బడ్జెట్ ధరలో లభిస్తుంది
ఈరోజు 30 వేల కంటే తక్కువ ధరలో అందుకునే ఛాన్స్ వుంది
ఈ బెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా
OnePlus 12R స్మార్ట్ ఫోన్ రోజు గొప్ప డిస్కౌంట్ లతో బడ్జెట్ ధరలో లభిస్తుంది. భారత మార్కెట్లో ప్రీమియం ధరలో వచ్చిన ఈ ఫోన్ ను ఈరోజు 30 వేల కంటే తక్కువ ధరలో అందుకునే ఛాన్స్ వుంది. ఈ ఫోన్ ప్రీమియం కెమెరా సెటప్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది. మరి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveyOnePlus 12R : డీల్స్
వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ రూ. 39,999 రూపాయల బేసిక్ ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు రూ. 7,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 32,999 రూపాయల ఆఫర్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, RBL బ్యాంక్ మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కో కొనుగోలు చేసే వారికి కూడా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 29,999 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ ను అమేజ్ ఇండియా మరియు oneplus.com నుంచి అఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy From Here
Also Read: బిగ్ డిస్కౌంట్ తో 5 వేలకే 200W 5.1 Soundbar అందుకోండి.. ఎక్కడంటే.!
OnePlus 12R : ఫీచర్స్
ఈ వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 ఫాస్ట్ చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. దీనికి జతగా 8GB LPDDR5X RAM మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ AMOLED ProXDR స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 1-120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, LTPO4.0, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు HDR10+ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony IMX890) ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలు షూట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 100W SUPERVOOC ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.