OTT లో లేటెస్ట్ గా రిలీజైన ఈ బ్లాక్ బాస్టర్ సినిమాలు చూశారా..!!

HIGHLIGHTS

ఈ వారం OTT లో బ్లాక్ బాస్టర్ మూవీలు రిలీజ్ అయ్యయి

'KGF చాఫ్టర్ 2' కూడా ఈ వారం నుండి ఉచితంగా స్ట్రీమ్ అవుతోంది

అశోక వనంలో అర్జున కళ్యాణం కూడా OTT లో స్ట్రీమ్ అవుతోంది

OTT లో లేటెస్ట్ గా రిలీజైన ఈ బ్లాక్ బాస్టర్ సినిమాలు చూశారా..!!

ఈ వారం OTT లో బ్లాక్ బాస్టర్ మూవీలు రిలీజ్ అయ్యయి. దేశం మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'KGF చాఫ్టర్ 2' కూడా ఈ వారం నుండి ఉచితంగా స్ట్రీమ్ అవుతోంది. అంతేకాదు, అత్యధికంగా వార్తల్లో నిలిచినా కూడా ప్రేక్షకుల మనసు దోచుకొని మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్ మూవీ 'అశోక వనంలో అర్జున కళ్యాణం' కూడా ఈ లేటెస్ట్ గా OTT లో రిలీజ్ అయ్యి స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ వారం OTT లో తాజాగా విడుదలైన కొత్త సినిమాలు ఏమిటో చూద్దామా.           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

KGF: చాఫ్టర్ 2

2022 అతిపెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ KG F: చాఫ్టర్ 2 కూడా జూన్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉచితంగా సబ్ స్క్రైబర్స్ అందరికి అందుబటులోకి వచ్చింది. ముందుగా, KGF: చాఫ్టర్ 2 అమెజాన్ ప్రైమ్ నుండి రెంట్ చెల్లించి చూసే పద్దతిలో అందుబాటులో వుంది. కానీ, జూన్ 3 నుండి KGF: చాఫ్టర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ అందిరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా రిలీజైన ప్రతి చోటా భారీ కలక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లు కంటే ఎక్కువ వసూళ్లను సాధించింది.

జన గణ మన

పృథ్వీరాజ్ మరియు సూరజ్ వెంజరాముడు కలిసి నటించిన మలయాళీ మూవీ 'జన గణ మన' లేటెస్ట్ గా ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో చూడవచ్చు. ఏప్రిల్ 28 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా జూన్ 2 నుండి Netflix ద్వారా స్ట్రీమ్ అవుతోంది.

అశోక వనంలో అర్జున కళ్యాణం

విశ్వక్ సేన్ మరియు రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన ఈ చిత్రం విడుదల కంటే ముందే చాలా ఒడిదిడుకులను చూసింది. అయితే, ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది మరియు అందరి ప్రశంసలను కూడా అందుకుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ఎంజాయ్ చేయదగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇప్పుడు OTT లో స్ట్రీమ్ అవుతోంది. అశోక వనంలో అర్జున కళ్యాణం జూన్ 3 నుండి AHA నుండి స్ట్రీమ్ అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo