KGF: Chapter 2 కోసం OTT స్ట్రీమ్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. నిన్నటి వరకూ కేవలం రెంటల్ సబ్ స్క్రిప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉన్న KGF చాఫ్టర్ 2 సినిమా, ఈరోజు నుండి డిజిటల్ సబ్ స్క్రిప్షన్ కు అందుబాటులోకి వచ్చింది. అంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ అందరూ కూడా KGF: చాఫ్టర్ 2 ను ఉచితంగా చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
KGF: చాఫ్టర్ 2 సినిమా యొక్క OTT రైట్స్ ను అమెజాన్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. అందుకే, అమెజాన్ ఈ సినిమాను డిజిటల్ సబ్ స్క్రిప్షన్ కంటే ముందుగా రెంట్ చెల్లించి చూసే విధానంతో అందుబాటులో ఉంచింది. అంతేకాదు, ఈ సినీమా రెంట్ చెల్లించి చూడ్డానికి 199 భారీ మొత్తాన్ని రూపాయలు చెల్లిచవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ, తెలుగు, మళయాళం, తమిళం మరియు కన్నడ భాషల్లో సబ్ స్క్రైబర్స్ అందరికి అందుబాటులో వుంది.
భాక్సాఫీస్ వద్ద రికార్డు కలక్షన్స్ వసూలు చేసిన KGF: చాఫ్టర్ 2 సినిమా ఇప్పుడు OTT లో అందరికి అందుబాటులోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాలీవుడ్ లో సైతం రికార్డులు బద్దులు కొట్టింది.