KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్..!!

HIGHLIGHTS

KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్

KGF: చాఫ్టర్ 2 రెంట్ కట్టి చూసేందుకు అందుబాటులోకి వచ్చింది

ఈ సినిమా హిందీ, తెలుగు, మళయాళం, తమిళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులో వుంది

KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్..!!

KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం, డిజిటల్ సబ్ స్క్రిప్షన్ కంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి KGF: చాఫ్టర్ 2 రెంట్ కట్టి చూసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే, సినిమా హల్ లో మాదిరిగా ఈ సినిమాను ఈ టీవీల్లో చూడడానికి కూడా టిక్కెట్ కొనుక్కోవాలన్న మాట. ఈ సినిమా రెంటల్ యాక్సెస్ కూడా భారీ ధరతో వుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

KGF: చాఫ్టర్ 2 OTT రైట్స్ ను అమెజాన్ సొంతం చేసుకుంది మరియు దీని కోసం భారీ మొత్తాన్ని కూడా అఫర్ చేసింది. అందుకే కాబోలు అమెజాన్ ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ సబ్ స్క్రిప్షన్ కంటే ముందుగా రెంట్ చెల్లించి చూసే అవకాశాన్ని ప్రేక్షకుల కోసం తీసుకొచ్చింది. అయితే, ఈ సినీమా రెంట్ చెల్లించి చూడ్డానికి 199 రూపాయలు చెల్లిచవలసి ఉంటుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, మళయాళం, తమిళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులో వుంది.

 ఇప్పటికి థియేటర్లలో మంచి కలక్షన్స్ వసూలు చేస్తున్న KGF: చాఫ్టర్ 2 సినిమా ఇప్పుడు OTT రెంటల్ ద్వారా కూడా భారీ అమౌంట్ నే అమెజాన్ కు తెచ్చిపెడుతుందని ఊహిస్తున్నారు. మరి, ఈ సినిమా రెగ్యులర్ సబ్ స్క్రైబర్స్ కి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo