పూర్తి స్థాయి ఆకోమ్యాటిక్ సోలార్ కార్ ను నిర్మించిన కాశ్మీర్ లెక్కల మాస్టర్..!!
బిలాల్ అహ్మద్ సౌరశక్తితో నడిచే సోలార్ కారును రూపొందించారు
ఈ సోలార్ కారును కోసం 11 సంవత్సరాలుగా బిలాల్ కృషి చేశారు
బిలాల్ అహ్మద్ పెట్రోల్ మరియు డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో నడిచే కారును రూపొందించారు
ప్రపంచం మొత్తం ఇంధనం కొరతతో బాధపడుతున్న తరుణంలో, కశ్మీర్ గణిత ఉపాధ్యాయుడు బిలాల్ అహ్మద్ పెట్రోల్ మరియు డీజిల్ కు ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో నడిచే సోలార్ కారును రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే, ఇదేదో ఒక్కరాత్రిలో జరిగిన అద్భుతం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, ఈ సోలార్ కారును నిర్మించడానికి గత 11 సంవత్సరాలుగా బిలాల్ అహ్మద్ నిరంతర కృషి దాగివుంది. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సనత్ నగర్ లో నివసించే బిలాల్ అహ్మద్ చాలా సంవత్సరాలుగా వివిధ కార్లను క్రియేట్ చేసే ఆలోచనల పై పనిచేస్తున్నారు. ఈ సౌరశక్తితో నడిచే కారు కూడా అతని 11 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన మరియు కృషి ఫలితంగా నిర్మితమైనదే.
Surveyవాస్తవానికి, శిలాజ ఇంధనం ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది పర్యావరణ కాలుష్యం ఐతే రెండవది లోటు. ఇక ప్రస్తుత ఎకనామిక్ కాలంలో ప్రక్రుతి ప్రసాదించిన వస్తువు కూడా కమర్షియల్ గా మారిపోయింది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే శిలాజ ఇంధనాలైన డీజిల్, పెట్రోల్ వంటి ముఖ్యమైన ఇంధనాలకు ప్రత్యామ్నాయం చాలా అవసరం అవుతోంది. ఎందుకంటే, మార్కెట్లో వీటికి పెరుగుతున్న డిమాండ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది మరియు ఇదే విధంగా పెరుగుతూ పొతే కొంత కాలానికి ఇవి పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం కూడా ఉంది.
అందుకే, పెట్రోల్, డీజిల్ పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు భారతదేశం ఎంతమాత్రం మినహాయింపు కాదు. భారతదేశంలో కూడా CNG మరియు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగింది. ఈ విషయాన్ని ముందుచూపుతో చూసిన కశ్మీర్ గణిత ఉపాధ్యాయుడు బిలాల్ అహ్మద్ పెట్రోల్ మరియు డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో నడిచే కారును రూపొందించారు.
అసలు బిలాల్ క్రియేట్ సోలార్ కార్ లో ఏముంది?
బిలాల్ అహ్మద్ నిర్మించిన కారు పూర్తిగా సోలార్ పవర్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ సోలార్ మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్‌తో తయారు చేయబడింది. అంటే, ఈ సోలార్ కారు తక్కువ ఎండలో కూడా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. అంతేకాదు, ఈ సోలార్ కారు మొత్తం సోలార్ ప్యానల్ అమర్చినా కూడా సౌకర్యవంతంగా మరియు అందంగా ఈ కారు కనిపించేలా కూడా అహ్మద్ జాగ్రత్తలు తీసుకున్నారు. 2009 లోనే సౌరశక్తితో నడిచే కారును తయారు చేయాలని బిలాల్ ఆలోచన చేశాడు మరియు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. కానీ, సుదీర్ఘ కాలం (పదకొండేళ్లపాటు) ప్రయత్నించి తన లక్ష్య సాధనలో విజయం సాధించాడు.