జియోఫోన్ యూజర్ల కోసం 5 సూపర్ ప్లాన్స్

జియోఫోన్ యూజర్ల కోసం 5 సూపర్ ప్లాన్స్
HIGHLIGHTS

జియోఫోన్ యూజర్ల కోసం ఎక్కువ డేటా

5 కొత్త ప్లాన్స్ అన్ని కూడా 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తాయి.

కేవలం 22 రూపాయల ధరలో 2GB డేటా

జియోఫోన్ యూజర్ల కోసం ఎక్కువ డేటా మరియు వ్యాలిడిటీ అఫర్ చేసే 5 కొత్త డేటా ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ కేవలం 22 రుపాయల అతి తక్కువ రేటు నుండి ప్రారంభమవుతాయి.  ఈ 5 కొత్త ప్లాన్స్ అన్ని కూడా 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తాయి. జియోఫోన్ యూజర్లకు అధిక డేటాతో పాటుగా ఎక్కువ వ్యాలిడిటీ అందించడానికి ఈ ప్లాన్స్ అందించింది. అయితే, ఈ ప్లాన్స్ కేవలం డేటాతో మాత్రమే వచ్చే ప్లాన్స్, ఈ ప్లాన్స్ తో ఎటువంటి వాయిస్ లేదా SMS సర్వీస్ లు అందించవు.

జియోఫోన్ 5 కొత్త డేటా ప్లాన్స్

1. Rs. 22 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 22 రూపాయల ధరలో 2GB డేటాని పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.    

2. Rs. 52 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 52 రూపాయల ధరలో 6GB డేటాని పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.    

3. Rs. 72 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 72 రూపాయల ధరలో డైలీ  0.5GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 14GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.    

4. Rs. 102 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 102 రూపాయల ధరలో డైలీ  1GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 28GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.    

5. Rs. 152 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్లాన్ కేవలం 22 రూపాయల ధరలో డైలీ  2GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 56GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo