గూగుల్ ఫోటోస్ నుండి తొలగించిన Photos తిరిగి పొందడం ఎలా..!
By
Raja Pullagura |
Updated on 09-Feb-2022
HIGHLIGHTS
గూగుల్ ఫోటోస్ అనేది గొప్ప ఫోటో బ్యాకప్ సర్వీస్
ఇది ఉచితంగా లభిస్తుంది
ఫోటోలను ఏ డివైజ్ నుండైనా యాక్సెస్ చేయవచ్చు
గూగుల్ ఫోటోస్ అనేది గొప్ప ఫోటో బ్యాకప్ సర్వీస్, ఇది ఉచితంగా లభిస్తుంది. మీరు మీ ఫోటోలను ఏ డివైజ్ నుండైనా యాక్సెస్ చేయవచ్చు మరియు వాటిని Cloud లో బ్యాకప్ చేయవచ్చు. అయినప్పటికీ, మీరు మీ ఫోటోలు మరియు వీడియోలను డిలీట్ చేసే అవకాశం వుంటుంది. కానీ, ఒకవేళ మీరు Google Photos నుండి అనుకోకుండా ఏదైనా ఫోటో లేదా వీడియోలను తొలగిస్తే, 60 రోజుల్లోపు వాటిని సులభంగా తిరిగి పొందవచ్చు. గూగుల్ ఫోటోస్ నుండి తొలగించిన ఫోటోలను తిరిగి పొందడం ఎలా? అనేవిషయాన్ని ఇక్కడ తెలుసుకోండి.
Survey✅ Thank you for completing the survey!
కంప్యూటర్ లో
- మీ కంప్యూటర్ లో Google Photos ను తెరవండి
- మీరు ఇప్పటి వరకూ సైన్ కాకపోతే మీ Google Account కు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపున ఉన్న మెనులోని ‘Trash’ పై క్లిక్ చేయండి.
- మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటోలను ఎంచుకోండి మరియు కుడి ఎగువ మూలలోని ‘Restore’ బటన్ పైన క్లిక్ చేయండి.
- మీ ఫోటోలు ఇప్పుడు మీ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి.
IOS మరియు Android లో
- మీ ఫోన్ లో Google Photos యాప్ తెరవండి.
- ఎగువ ఎడమ వైపున ఉన్న మూడు వరుసల లేదా ‘Hamburger’ చిహ్నంపై క్లిక్ చేయండి.
- ‘Trash’ పై క్లిక్ చేయండి
- మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటోలను ఎక్కువసేపు నొక్కడం ద్వారా ఎంచుకోండి
- ‘Restore’ బటన్ పై క్లిక్ చేయండి
- మీ ఫోటోలు ఇప్పుడు లైబ్రరీలో కనిపిస్తాయి.
మీ ఫోటోలను ఎప్పుడు మీరు Restore చేయలేరు
- 60 రోజుల కంటే ముందుగా ‘Trash’ కి తరలించిన ఫోటోలు మరియు వీడియోలు.
- మీరు ట్రాష్ నుండి శాశ్వతంగా తొలగించిన ఫోటోలు మరియు వీడియోలు
- మీ డివైజ్ ని బ్యాకప్ చేయకుండా మీరు మీ ఫోటో గ్యాలరీ నుండి శాశ్వతంగా తొలగించిన ఫోటోలు.
- మీరు ‘Trash’ తరలించి తరువాత, Emty చేసిన తరువాత.
- ఈ పైన తెలిపిన సాందర్భాల తరువాత ఆ ఫోటోలు లేదా వీడియోలను మీరు తిరిగి తీసుకురాలేరు.