మీ Aadhaar మరియు PAN లింక్ అయ్యిందా లేదా మీరే చెక్ చేసుకోండి.!
భారత ప్రభుత్వం పాన్ కార్డు తో వారి ఆధార్ ని లింక్ చేయడం కూడా తప్పనిసరి చేసింది
డిసెంబర్ 31వ తేదీ లోపు పాన్ ఆధార్ లింక్ చేయని యెడల వారి పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ కేటగిరి లోకి వస్తుంది
మీ ఫోన్ లో మీ పాన్ మరియు ఆధార్ లింక్ స్టేటస్ మీరే చెక్ చేసుకోవచ్చు
భారత ప్రభుత్వం పన్ను చెల్లించే ప్రతి పౌరుడికి PAN (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) ని తప్పనిసరి చేసింది. అంతేకాదు, ఇప్పుడు పాన్ కార్డు కలిగిన ప్రతి కార్డ్ హోల్డర్ కూడా వారి పాన్ కార్డు తో వారి ఆధార్ ని లింక్ చేయడం కూడా తప్పనిసరి చేసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో పాన్ కార్డు హోల్డర్లు వారి పాన్ ఆధార్ లింక్ చేయడం ముగించారు. అయితే, ఇప్పటికీ కూడా కొంత మంది పాన్ కార్డు కలిగిన వారు వారి ఆధార్ తో లింక్ చేయడం పూర్తి చేయలేదు. అయితే, కొందరు ఈ ప్రక్రియను ముగించినా వారి అకౌంట్ లింక్ కావడం లో వచ్చిన సమస్య కారణంగా విరమించినట్లు చెబుతున్నారు. అయితే, డిసెంబర్ 31వ తేదీ లోపు పాన్ ఆధార్ లింక్ చేయని యెడల వారి పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ కేటగిరి లోకి వస్తుంది.
SurveyAadhaar PAN లింక్ ఎందుకు చేయాలి?
ఆధార్ – పాన్ లింకింగ్ తో ఒక్క వ్యక్తికి ఒకే ఫైనాన్షియల్ ఐడెంటిటీ ఉండేలా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఈ కొత్త నిబంధనలతో పన్ను పారదర్శకత, డిజిటల్ సెక్యూరిటీ మరియు డిజిటల్ గవర్నెన్స్‌లో మరో మైలురాయిని చేరుకోవచ్చు.
Aadhaar PAN లింక్ ఆఖరు తేదీ ఏమిటి?
31 డిసెంబర్ 2025 తేదీ లోపు పాన్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా విధిగా వారి పాన్ మరియు ఆధార్ లింక్ చేయాలి. లేదంటే వారి పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది. అంటే, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవకాశం కూడా ఉంటుంది. అందుకే, ఈ గడువు ముగిసే లోపుగా పాన్ ఆధార్ లింక్ చేయడం మంచిది.
Also Read: లాంచ్ కంటే ముందే Moto G67 Power 5G టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
పాన్ ఆధార్ లింక్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేయాలి?
దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు, మీ ఫోన్ లో మీరే సొంతంగా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం, ముందుగా www.incometax.gov.in/iec/foportal ని ఓపెన్ చేయండి. ఈ మెయిన్ పేజీ లో QuickLinks ట్యాబ్ లో అడుగున Link Aadhar Status పై నొక్కండి. ఇక్కడ మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అందించిన బాక్స్ లో మీ ఆధార్ మరియు పాన్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన కనిపించే Validate పై నొక్కండి. అంతే, మీ పాన్ మరియు ఆధార్ లింక్ అయ్యిందా లేదా మీకు ఇక్కడ చూపిస్తుంది.

ఒక వేళ మీ ఆధార్ మీ పాన్ కార్డు తో లింక్ అవ్వకపోతే వెంటనే లింక్ చేయండి. లేకపోతే మీ పాన్ కార్డ్ తో నిర్వహించే అన్ని పనులకు ఆటంకం కలుగుతుంది. అంతేకాదు, ఇన్‌కమ్ టాక్స్ మీ పైన లీగల్ గా తీసుకునే చర్యలకు కూడా మీరు బాద్యులయ్యే అవకాశం ఉంటుంది.