Google త్వరలోనే TrueCaller కి పోటీనిచ్చే కొత్త యాప్ తెస్తోంది

Google త్వరలోనే TrueCaller కి పోటీనిచ్చే కొత్త యాప్ తెస్తోంది
HIGHLIGHTS

గూగుల్, Google Call అనే కొత్త యాప్ లాంచ్ కోసం సన్నాహాలు చేస్తోంది.

ఈ యాప్ ద్వారా, సంస్థ TrueCaller ‌కు గట్టి పోటీని ఇవ్వనుంది

ఈ యాప్ త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్, Google Call అనే కొత్త యాప్ లాంచ్ కోసం సన్నాహాలు చేస్తోంది. త్వరలో రాబోయే ఈ మొబైల్ యాప్ లో, వినియోగదారులు కాలర్ ఐడి మరియు స్పామ్ కాల్‌లను ఆపడానికి సదుపాయాన్ని పొందుతారు. ఈ యాప్ ద్వారా, సంస్థ TrueCaller ‌కు గట్టి పోటీని ఇవ్వనుంది.

మొబైల్ ఇండియన్ రిపోర్టర్ యొక్క నివేదిక ప్రకారం, Redditor గూగుల్ యొక్క ఈ యాప్ యూట్యూబ్ ప్రకటనలో చూశాడు. యూట్యూబ్‌లో చూసిన ఈ ప్రకటన" లెట్స్ యు ఆన్సర్ విత్ కాన్ఫిడెన్స్" అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించింది.

గూగుల్ కొత్త యాప్ Google Call ప్రారంభిస్తోంది

Google Call ప్రారంభించడం గురించి గూగుల్ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈ యాప్ త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. గూగుల్ యొక్క Google Call యాప్  ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వస్తుందని చెప్పవచ్చు. ఈ యాప్  యొక్క ప్రయోజనం ఏమిటంటే, స్క్రీన్ లాక్ అయిన తర్వాత కూడా ఇది వినియోగదారుకు కాలర్ పేరును చూపిస్తుంది. ఈ యాప్  కోసం ఇటీవల చాలా కొత్త ఫీచర్లు విడుదలయ్యాయి.

గూగుల్ ఇటీవల తన డిజిటల్ పేమెంట్ యాప్ ని పూర్తిగా పునః రూపకల్పన చేసింది. కొత్త మార్పు వల్ల గూగుల్ పే యూజర్లు డబ్బు ఆదా చేయడం సులభతరం అవుతుందని గూగుల్ పేర్కొంది. అలాగే, వినియోగదారులు వారి ఖర్చులపై నిఘా ఉంచగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికన్ వినియోగదారుల కోసం మాత్రమే తీసుకురాబడింది మరియు త్వరలో భారతదేశంతో సహా ఇతర దేశాలలో గూగుల్ పే కోసం అప్డేట్ అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo