Google Down: సడన్ గా డౌన్ అయిన గూగుల్.. భారీగా రిపోర్ట్ చేసిన యూజర్లు.!

HIGHLIGHTS

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఈరోజు డౌన్ అయ్యింది

వినియోగదారులు గూగుల్ సేవల్లో అంతరాయం ఎదుర్కొన్నట్లు రిపోర్ట్ చేశారు

సోషల్ మీడియాలో #GoogleDown ట్రెండ్ ను వైరల్ చేశారు

Google Down: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఈరోజు డౌన్ అయ్యింది. ఉదయం 10 గంటల సమయం నుంచి గూగుల్ సర్వీస్ లో అంతరాయం కలిగినట్లు గుర్తించిన యూజర్లు ప్రముఖ రిపోర్టింగ్ సైట్ డౌన్ డిటెక్టర్ నుంచి విషయం పై రిపోర్ట్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు గూగుల్ సేవల్లో అంతరాయం ఎదుర్కొన్నట్లు రిపోర్ట్ చేశారు. ముఖ్యంగా Google Search, YouTube, Google Drive వంటి ప్రముఖ సేవలు సరిగా పనిచేయకపోవడం గురించి సోషల్ మీడియాలో #GoogleDown ట్రెండ్ ను వైరల్ చేశారు.

Google Down: సమస్య ఏమిటి?

యూజర్లు తమ అకౌంట్ లో లాగిన్ కావడంలో సమస్యలు చూసినట్లు కొందరు రిపోర్ట్ చేశారు. అయితే, కొందరికి సెర్చ్ ఫలితాలు లోడ్ కాకపోవడం మరియు మరికొందరికి ఈమెయిల్స్ పంపడం లేదా స్వీకరించడంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు తెలిపారు. అంతేకాదు, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్ అయిన YouTube కూడా కొంతసేపు స్లోగా పనిచేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, సర్వర్ కనెక్టివిటీ సమస్యలు లేదా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపాల కారణంగా ఈ అంతరాయం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, గూగుల్ తరపున పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, డౌన్‌ డిటెక్టర్ వంటి వెబ్‌ సైట్లలో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్, భారత్ సహా అనేక దేశాల్లో ఈ సమస్య ప్రభావం చూపినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు.

Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అతి చవక ధరలో లభిస్తోంది.!

ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి?

ఇలాంటి పరిస్థితుల్లో యూజర్లు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే రీ కనెక్షన్ కోసం ఛాన్స్ ఉంటుంది. అవేమిటంటే, మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ ను ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే, ఇంటర్నెట్ కనెక్షన్ స్లో గా ఉంటే సర్వీస్ లో అంతరాయం మాదిరిగా అనిపిస్తుంది. డివైజ్ లో ఉన్న యాప్‌ ను రీస్టార్ట్ చేయండి. అయినా కూడా సర్వీస్ అంతరాయం చూపిస్తే, కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. చివరిగా అధికారిక అప్‌ డేట్స్ కోసం గూగుల్ స్టేటస్ డాష్ బోర్డు ను పరిశీలించండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :