Install App Install App

ఈ ఫోన్లలో Youtube, Gmail వంటి గూగుల్ యాప్స్ ఇక పనిచేయవు..ఎందుకంటే..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 12 Sep 2021
HIGHLIGHTS
  • ఈ ఫోన్లలో Youtube, Gmail వంటి గూగుల్ యాప్స్ పనిచేయవు

  • ఈ నెల చివరి వరకూ మాత్రమే ఈ యాప్స్ పనిచేస్తాయి

  • మీ ఫోన్ కూడా ఒకసారి చేసుకోండి

ఈ ఫోన్లలో Youtube, Gmail వంటి గూగుల్ యాప్స్ ఇక పనిచేయవు..ఎందుకంటే..!
ఈ ఫోన్లలో Youtube, Gmail వంటి గూగుల్ యాప్స్ ఇక పనిచేయవు..ఎందుకంటే..!

ఈ ఫోన్లలో Youtube, Gmail వంటి గూగుల్ యాప్స్ ఇక పనిచేయవు.  ఎందుకంటే, ఈ నెల చివరిలో గూగుల్ తన లేటెస్ట్ అప్డేట్ ను విడుదల చేస్తోంది. ఈ అప్డేట్ తరువాత Youtube, Gmail మరియు గూగుల్ డ్రైవ్ వంటి యాప్స్ పనిచేయవు. దీనికి కారణం, ఈ అప్డేట్ ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్ మరియు అంతకంటే పైన వచ్చిన వెర్షన్స్ తో మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి, 2.3.7 మరియు అంతకన్నా తక్కువ వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్స్ పనిచేయడం మానేస్తాయి. దీనికి కారణం 2.3.7 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మద్దతును నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సర్వీస్ ఉపయోగించడానికి 3.0 అంతకన్నా పైన వెర్షన్ ను కలిగివుండాలని గూగుల్ తెలిపింది. అంటే కొత్త నిబంధనల ప్రకారం, 3.0 కన్నా తక్కువ వెర్షన్ ఉపయోగించేవారు యూట్యూబ్, జిమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్ తో సహా మరికొన్ని గూగుల్ సర్వీస్ లను ఉపయోగించలేరు. అంటే, గూగుల్ హనీ కాంబ్ వెర్షన్ ను వినియోగదారులు వారి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కలిగి ఉండాలి.

గూగుల్ ఆండ్రాయిడ్ అప్డేట్

ఇప్పటికే గూగుల్ అటువంటి వెర్షన్ వాడేవారికి మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపింది మరియు సెప్టెంబర్ 2 తరువాత ఆ వెర్షన్ కలిగిన వారు వారి  జిమెయిల్, యూట్యూబ్ మరియు మరికొన్ని గూగుల్ యాప్స్ కి లాగిన అవ్వలేరు. అటువంటి వారు వారి ఫోన్లను రీసెట్ చేసిన లేదా కొత్త అకౌంట్ తో లాగిన్  చేయాలని చూసినా 'యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎర్రర్' ని మాత్రమే చూస్తారు.

అయితే, యాప్స్ ద్వారా మీరు లాగిన్ చెయ్యలేక పోయినా, వెబ్ బ్రౌజరు నుండి లాగిన్ చేయ్యుడానికి వీలుంటుంది. బ్రౌజర్ నుండి ఏదైనా Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా వాటిని ఉపయోగించవచ్చు. మీరు వెబ్ బ్రౌజర్ నుండి ఎంచుకున్న కొన్ని Google సేవలను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: google apps like youtube gmail and more will not work in these android phones here is why
Tags:
gamil google apps youtube android update google update
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status