Gold Price: దూసుకు పోతున్నపసిడి సూచీలు.!

HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో దూసుకు పోతున్న పసిడి సూచీలు

ఈ ఒక్కరోజు లోనే పెరిగి మార్కెట్ యథాస్థానానికి చేరుకుంది

బంగారం ధర 990 రూపాయలకు పైగా పెరిగింది

Gold Price: ఈరోజు మార్కెట్ లో దూసుకు పోతున్న పసిడి సూచీలు. గత నాలుగు రోజుల్లో తగ్గిన గోల్డ్ రేట్ మొత్తం కూడా ఈ ఒక్కరోజు లోనే పెరిగి మార్కెట్ యథాస్థానానికి చేరుకుంది. ఇది ఊహించని పరిణామంగా మార్కెట్ వర్గాలు చెప్పుంటున్నాయి. ఇక ఈ నెల ప్రారంభం నుండి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  దాదాపుగా 1,000 రూపాయల పడిపోగా, ఈ ఒక్కరోజే 990 రూపాయలకు పైగా పెరిగింది. మరో ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా.

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,100 రూపాయలుగా ఉండగా, ఈరోజు 900 రూపాయలు పైకి ఎగబాకి రూ.47,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,280 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,290 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,440 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,040 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :