మీ 5G Smartphone లో ఇంటర్నెట్ స్పీడ్ ఇలా పెంచుకోండి.!

HIGHLIGHTS

దేశం మొత్తం 5G నెట్వర్క్ తో దేదీప్యమానంగా వెలిగిపోతోంది

5జి నెట్‌వర్క్ ఉన్నా కూడా మీ 5G Smartphone లో తగిన ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడం చూసి ఉండవచ్చు

5జి స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ ను ఎలా పెంచుకోవాలో ఈరోజు తెలుసుకోండి

వేసి మొత్తం 5G నెట్వర్క్ తో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అయితే, కొన్ని సందర్భాల్లో 5జి నెట్‌వర్క్ ఉన్నా కూడా మీ 5G Smartphone లో తగిన ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడం చూసి ఉండవచ్చు. అటువంటి సమయాల్లో 5g నెట్‌వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా లేని కారణంగా చాలా పనులకు ఆటంకం కలుగుతుంది. అయితే, 5జి స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ ను ఎలా పెంచుకోవాలో ఈరోజు విపులంగా చర్చిద్దాం.

5G Smartphone ఇంటర్నెట్ స్పీడ్

అన్నింటి కంటే ముందు మీ స్మార్ట్ ఫోన్ లో అన్ని బ్యాండ్స్ కి 5జి సపోర్ట్ ఉందొ లేదో చెక్ చేయండి. అన్ని కంపెనీలు కూడా ‘5జి రెడీ’ ఫోన్ అని చెబుతాయి కానీ, అన్ని బ్యాండ్స్ కి సపోర్ట్ చేయవు. అందుకే, మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో ఉన్న నెట్‌వర్క్ ఆప్షన్ లో Preferred Network Type లో మీ ఫోన్ 5జి బ్యాండ్ సపోర్ట్ ను పరిశీలించండి.

గమనిక : మంచి 5జి ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే ఎక్కువ బ్యాండ్స్ సపోర్ట్ చేసే 5జి ఫోన్ లేదా డివైజ్ ఎంచుకోవాలి.

సరైన 5జి నెట్ వర్క్ మోడ్ ఎంచుకోండి

చాలా సార్లు ఫోన్ డిఫాల్ట్ గా ‘ఆటో మోడ్’ లో ఉంటుంది. అయితే, ఇంటర్నెట్ స్పీడ్ సరిగా లేనప్పుడు మాన్యువల్ గా నెట్ వర్క్ ను సెలెక్ట్ చేయండి.

మీ లొకేషన్ చాలా ముఖ్యమైనది

5జి సిగ్నల్ టవర్ దగ్గర బాగా పని చేస్తుంది. అందుకే, మీరు అండర్ గ్రౌండ్ లో
ఉన్నప్పుడు లేదా ఇండోర్ లో ఉన్నప్పుడు సిగ్నల్ మరియు ఇంటర్నెట్ స్పీడ్ కూడా లోపిస్తుంది. అటువంటి సమయంలో విండో దగ్గరకు వచ్చిన స్పీడ్ టెస్ట్ చేయండి.

సిగ్నల్ శక్తిని చెక్ చేయండి

ఈ ఫోన్ లో సిగ్నల్ బార్ లు తక్కువగా ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. మీ ఫోన్ లో కనీసం 3-4 బార్ లైనా ఉండాలి. ఒకవేళ లేకపోతే మీ ఫోన్ లొకేషన్ మార్చండి.

Airplane mode ట్రిక్

ఇది చాలా సింపుల్ ట్రిక్ కానీ చాలా సమర్థవంతంగా ఉంటుంది. మీ ఫోన్ లోని Airplane మోడ్ ఆన్ చేసి 10 సెకండ్ల తర్వాత ఆఫ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ నెట్‌వర్క్ రిఫ్రెష్ అవుతుంది మరియు బెటర్ సిగ్నల్ లభిస్తుంది.

బ్యాగ్ రౌండ్ యాప్స్ క్లోజ్ చేయండి

ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మనకు తెలియకుండా బ్యాక్ గ్రౌండ్ లో చాలా యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ని యూజ్ చేస్తుంటాయి. అందుకే మనం వాడుతున్న యాప్స్ లేదా సర్ఫింగ్ కోసం ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే, బ్యాగ్ రౌండ్ యాప్స్ క్లోజ్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచడానికి ఒక మార్గం అవుతుంది.

ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయండి

మీ ఫోన్లో పాత సాఫ్ట్‌వేర్ కారణంగా నెట్‌వర్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, మీ స్మార్ట్ ఫోన్ ని ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్ వేర్ తో అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి కొత్త అప్‌డేట్స్ ను ఎంచుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.

APN settings ఆప్టిమైజ్ చేయండి

అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు నెట్‌వర్క్ కోసం వచ్చే డిఫాల్ట్ APN స్లో గా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మీ సర్వీస్ ప్రొవైడర్ (Jio, Airtel) ఆఫర్ చేసే అఫీషియల్ APN ఉపయోగించండి.

Also Read: Tecno Pop X 5G: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో రిలీజ్ అవుతోంది.!

పీక్ టైమ్ లో ఇంటర్నెట్

పీక్ టైమ్ లో ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఎందుకంటే, ఒక టవర్ నుంచి అందించే డేటాని ఎక్కువ మంది యూజర్లు ఒకే సమయంలో ఉపయోగించటం వలన ఇది జరుగుతుంది. కాబట్టి, మంచి వేగవంతమైన ఇంటర్నెట్ కోసం పిక్ టైం అవాయిడ్ చేయండి.

ఫోన్ రీబూట్ లేదా రీస్టార్ట్ చేయండి

మరింత ఎక్కువగా ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గితే, ఫోన్ రీబూట్ లేదా రీస్టార్ట్ చేయండి. ఇలా చేయడంతో బ్యాగ్ రౌండ్ లో యాప్స్ క్లోజ్ అవుతాయి మరియు నెట్ వర్క్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి మీ ఫోన్ లో ఇంటర్నెట్ వేగం పెరిగే అవకాశం ఉంటుంది.

ఇలా చిన్న చిన్న టిప్స్ మరియు ట్రిక్స్ అమలు పరచడం ద్వారా మీ ఫోన్ లో ఇంటర్నెట్ వేగం పెరిగే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :