realme Buds T500 Pro launched with stunning design and features
Realme Buds T500 Pro ఇయర్ బడ్స్ ను ఈరోజు రియల్‌మీ ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఇయర్ బడ్స్ ను ఆకట్టుకునే ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ముఖ్యంగా, ఈ ఇయర్ బడ్స్ ను మంచి ఆకర్షణీయమైన క్యాండీ బాక్స్ డిజైన్ తో అందించింది. రియల్‌మీ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
రియల్‌మీ ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 2,799 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 200 డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఇయర్ బడ్స్ సేల్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మీ అఫీషియల్ సైట్ నుంచి ఈ బడ్స్ సేల్ అవుతుంది .
రియల్‌మీ బడ్స్ టి 500 ప్రో ఇయర్ బడ్స్ లెమన్ కోలా, చాకొలేట్ మరియు ఆరెంజ్ మింట్ మూడు అందమైన రంగుల్లో లభిస్తుంది.
Also Read: Tecno Pop X 5G: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో రిలీజ్ అవుతోంది.!
రియల్‌మీ బడ్స్ టి 500 ప్రో ఇయర్ బడ్స్ సరికొత్త క్యాండీ బాక్స్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. సంప్రదాయ ఇయర్ బడ్స్ తో పోలిస్తే ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అయితే, ఈ ఇయర్ బడ్స్ ను చెవుల్లో మరింత ఫిట్ అయ్యేలా అందించింది. ఈ బడ్స్ లో మంచి బాస్ మరియు క్లారిటీ సౌండ్ అందించే 12.4mm స్పీకర్లు కలిగి ఉంటాయి. మంచి ఆడియో కోసం ఈ బడ్స్ LHDC 5.0 మరియు Hi-Res ఆడియో వైర్లెస్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫీచర్స్ తో ఈ ఇయర్ బడ్స్ చాలా డెప్త్ అండ్ హై డెఫినేషన్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మ్యూజిక్ యాప్ సపోర్ట్ కలిగి ఉండటమే కాకుండా మల్టీ ఈక్వలైజర్ మోడ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లో ఒక్కొక్కదానిలో ట్రిపుల్ మైక్ సిస్టం ఉంటుంది. ఈ సెటప్ తో ఈ ఇయర్ బడ్స్ మంచి కాల్ ఎక్స్ పీరియన్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ రియల్‌మీ కొత్త బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 6.1 సపోర్ట్ కూడా కలిగి ఉంది.
ఇక బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ మొత్తం 56 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కేవలం 2 గంటల సమయంలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది 45 ms అతి తక్కువ జాప్యం ( Low Latency) మరియు ఫైండ్ మై ఇయర్ బడ్స్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ IP 55 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటాయని రియల్‌మీ తెలిపింది.