జబర్దస్త్ డిస్కౌంట్ తో 8 వేలకే 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

జబర్దస్త్ డిస్కౌంట్ తో 8 వేలకే 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి

ఇది నిజంగా నమ్మశక్యం కాని ఆఫర్ అని చెప్పవచ్చు

ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,099 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది

జబర్దస్త్ డిస్కౌంట్ తో 8 వేలకే 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. ఇది నిజంగా నమ్మశక్యం కాని ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ రూ. 14,999 రూపాయల ప్రైస్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది. అయితే, కాలక్రమేణా రేటులో మార్పులు జరిగాయి. కానీ, ఈరోజు లభిస్తున్న ధరలో ఎన్నడూ కూడా లభించలేదు. నిన్న కూడా ఈ సౌండ్ బార్ 10 వేల రూపాయల ధరతో సేల్ అయ్యింది. కానీ, ఈరోజు మాత్రం మీకు కేవలం 8 వేళా రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

3.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

బోట్ యొక్క 3.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Bar 4100DA ఈరోజు 8 వేల రూపాయల ధరలో లభిస్తోంది. ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ బోట్ సౌండ్ బార్ ను 84% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 ధరకు సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 900 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,099 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది.

బోట్ 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ బ్రాండ్ బోట్ అందించిన సౌండ్ బార్. ఇది చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో ముందు నాలుగు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఈ బార్ తో పాటు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఈ బోట్ సౌండ్ బార్ 3.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్టు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ మరియు థియేటర్ వంటి ఫీల్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, AUX, COAXIAL మరియు బ్లూటూత్ సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Realme Buds T500 Pro ఆకట్టుకునే ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఈ బోట్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు కలిగి ఉంది. ఈ సౌండ్ బార్ గతంలో లభించిన ధరతో పోలిస్తే ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :