OnePlus Pad 4: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు హెవీ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ టాబ్లెట్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది

ఈ పాడ్ ఇప్పటి వరకు వచ్చిన వాటిలో పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది

41 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే పవర్ ఫుల్ చిప్ సెట్ తో వస్తుంది

OnePlus Pad 4: వన్ ప్లస్ అప్ కమింగ్ టాబ్లెట్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. అదే వన్ ప్లస్ ప్యాడ్ 4 టాబ్లెట్ మరియు ఈ పాడ్ ఇప్పటి వరకు వచ్చిన వాటిలో పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ పాడ్ ను హెవీ బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ ఫోన్ టీజర్ చూస్తుంటే ఈ అప్ కమింగ్ పాడ్ ను చాలా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్ధం అవుతుంది.

OnePlus Pad 4 : లాంచ్ డేట్

వన్ ప్లస్ పాడ్ 4 ఇండియాలో ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ టాబ్లెట్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. అంటే, లాంచ్ తర్వాత కంపెనీ అఫీషియల్ సైట్ తో పాటు అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. ఈ టీజర్ పేజీ నుండి ఈ పాడ్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది.

OnePlus Pad 4 : కీలక ఫీచర్స్

వన్ ప్లస్ పాడ్ 4 చాలా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని టీజర్ పేజి చూస్తుంటే క్లియర్ గా అర్ధం అవుతుంది. ఈ పాడ్ చాలా స్లీక్ డిజైన్ తో మరియు రౌండ్ కార్నర్ తో ఉంటుంది. క్వాల్కమ్ యొక్క అత్యంత వేగవంతమైన ప్రోసెసర్ Snapdragon 8 Elite Gen 5 తో వన్ ప్లస్ ఈ పాడ్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది 41 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ పాడ్ లో పవర్ ఫుల్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ పాడ్ 13.2 ఇంచ్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ 3.4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గరిష్టంగా 540Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉండే 12 బిట్ ప్యానల్ తో ఉంటుంది. ముఖ్యంగా, ఈ పాడ్ డాల్బీ విజన్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: జబర్దస్త్ డిస్కౌంట్ తో 8 వేలకే 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

సౌండ్ కోసం కూడా ఈ పాడ్ లో గొప్ప స్పీకర్ సెటప్ అందించినట్లు వన్ ప్లస్ తెలిపింది. ఈ పాడ్ లో 4 బాస్ యూనిట్స్ జతగా 4 ట్వీటర్ తో మొత్తం 8 స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇది ఈ పాడ్ అందించే షార్ప్ విజువల్స్ కి తగిన పవర్ ఫుల్ సౌండ్ అందించడానికి తగిన విధంగా ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ గురించి కూడా వన్ ప్లస్ వివరాలు వెల్లడించింది. ఈ పాడ్ 13,380 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 20 గంటల వీడియో ప్లే లేదా 7 గంటల లాంగ్ ప్లే కోసం నిలిచి ఉంటుందని వన్ ప్లస్ తెలిపింది. ఈ పాడ్ వన్ ప్లస్ స్టయిలో ప్రో సపోర్ట్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :