Lumio Vision 9 QD MINI LED smart tv launched and know the price and features
Lumio Vision 9 సిరీస్ నుంచి ఈరోజు కొత్త 65 ఇంచ్ QD MINI LED స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ 4K 144Hz రిఫ్రెష్ రేట్ మరియు హెక్సా ఆడియో వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ కొత్త టెక్ ప్రోసెసర్ మరియు 3GB ర్యామ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది.
లూమియా కొత్త 65 ఇంచ్ క్యూడి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీని రూ. 64,999 ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఇది అన్ని ఆఫర్స్ కలుపుకొని నిర్ణయించిన ధర అని గమనించాలి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ లూమియా విజన్ 9 స్మార్ట్ టీవీ 65 ఇంచ్ EVA (ఎన్హెన్స్డ్ VA) ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఇంటిగ్రేటెడ్ క్యూలెడ్ మినీ ఎల్ఈడి తో వస్తుంది. ఇది 800 నిట్స్ పీక్ HDR బ్రైట్నెస్, HDR 10, డాల్బీ విజన్ మరియు ప్రెసిషన్ లోకల్ డిమ్మింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ టీవీ 100% NTSC సపోర్ట్ తో జబర్దస్త్ విజువల్స్ అందిస్తుంది.
ఈ టీవీ 4K రిజల్యూషన్ 144Hz రిఫ్రెష్ రేట్, VRR మరియు ALLM ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. లూమియా ఈ స్మార్ట్ టీవీని మీడియాటెక్ పెంటోనిక్ 700 చిప్ సెట్, 3GB DDR4 ర్యామ్ మరియు హెవీ స్టోరేజ్ తో లాంచ్ చేసింది. అంటే, ఈ టీవీ ల్యాగ్ లేకుండా గొప్ప టీవీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీలో PS5 మరియు Xbox సిరీస్ లేదా PC లెవల్ గేమింగ్ కి కూడా 4K లో ల్యాగ్ లేకుండా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 14 OS పై నడుస్తుంది.
Also Read: OnePlus Pad 4: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు హెవీ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ ఈ టీవీ హెక్సా స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ టీవిలో డ్యూయల్ సబ్ ఉఫర్, డ్యూయల్ మిడ్ స్పీకర్ మరియు డ్యూయల్ ట్వీటర్ స్పీకర్ కలిగి ఉంటుంది. ఇక ఈ స్పీకర్ సెటప్ తో ఈ స్మార్ట్ టీవీ 50W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ HDMI 2.1, USB 3.0, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.