Gold rate down today: ఈరోజు ఈ నెల కనిష్ఠాన్ని చూసిన బంగారం ధర| Compare Price

Gold rate down today: ఈరోజు ఈ నెల కనిష్ఠాన్ని చూసిన బంగారం ధర| Compare Price
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ భారీగా పడిపోయింది

స్థిరమైన రేటు వద్ద నెట్టుకొస్తున్న Gold Market ఈరోజు నష్టాలను చూసింది

Gold rate down today: ఈరోజు గోల్డ్ మార్కెట్ ఈ నెల కనిష్ఠ రేటును నమోదు చేసింది

Gold rate down today: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ భారీగా పడిపోయింది. గత వారం రోజులుగా స్థిరమైన రేటు వద్ద నెట్టుకొస్తున్న Gold Market ఈరోజు నష్టాలను చూసింది. అందుకే, ఈరోజు గోల్డ్ మార్కెట్ ఈ నెల కనిష్ఠ రేటును నమోదు చేసింది. అంతేకాదు, ఆగష్టు 20 తరువాత ఇంత తక్కువ రేటుకు గోల్డ్ చేరుకోవడం ఇదే మొదటిసారి. నిన్నటి వరకూ కూడా బంగారం ధర 60 వేల మార్క్ ను అంటి పెట్టుకొని తిరిగింది. మరి ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ మరియు Gold Compare Price ఏమిటో చూద్దామా.

Gold rate down today

ఈరోజు జి మార్కెట్ లో గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం 10 గ్రా 24K గోల్డ్ రేట్ రూ. 59,830 రూపాయల వద్ద ప్రారంభమై తులానికి రూ. 380 రూపాయల నష్టాన్ని చూసి రూ. 59,450 వద్ద ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, 10 గ్రా 22K ఆర్నమెంట్ బంగారం రూ. 54,840 రూపాయల వద్ద మొదలై 10 గ్రాములకు రూ. 340 రూపాయల నష్టాన్ని చూసి రూ. 54,500 వద్ద క్లోజింగ్ ను అందించింది. 

ఈ నెల మార్కెట్ Gold Compare Price ను పరిశీలిస్తే ఈరోజు ఈ నెల కనిష్ఠాన్ని గోల్డ్ మార్కెట్ చూసింది. అయితే, గోల్డ్ మార్కెట్ నిపుణులు చెబుతున్న విషయం మరోలా వుంది.

Gold rate down today  

Why gold prices are down?

గోల్డ్ రేట్ ఎందుకు పడిపోతుంది అంటే, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాస్తవానికి, గోల్డ్ సప్లై ఎక్కువగా వుంది డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ పడిపోతుంది. అయితే, డాలర్ తో రూపాయి మారకం విలువ మరియు వడ్డీ రేట్ల వంటివి విషయాలు కూడా గోల్డ్ రేట్ పైన ప్రభావం చూపుతాయి.

Will gold increase in future?

గత సంవత్సరంతో పోలిస్తే గోల్డ్ రేట్ బాగానే పెరిగింది. ప్రస్తుతం గోల్డ్ రేట్ స్థిరంగా ఉన్నా బంగారం ధరలో మార్పు అనేది జరుగుతుందని నిపుణులు సూచిస్తునారు. రానున్న పండుగ మరియు పెళ్లిళ్ల సీజన్ లో గోల్డ్ రేట్ లు ఒక్కసారిగా ఊపందుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అంటే, గోల్డ్ పైన పెట్టుబడి పెట్టదలుచుకున్న వారి కోసం మార్కెట్ నిపుణుల ఈ సూచనలు  అందిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo