పసిడి ప్రియులకు ఊరట .. ఈరోజు గ్రాముకు ఎంత తగ్గిందంటే..!!

పసిడి ప్రియులకు ఊరట .. ఈరోజు గ్రాముకు ఎంత తగ్గిందంటే..!!
HIGHLIGHTS

బంగారం ధర ఈరోజు దిగివచ్చింది

ఈరోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది

పసిడి ప్రియులకు ఊరట లభించింది

జూలై 1 వ తేదీ నుండి పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు దిగివచ్చింది. ఈ వారం రోజుల్లో మొత్తంగా తులానికి 1,500 పైగా తులం బంగారం ధర పెరిగింది. అంటే, గ్రాముకు 150 రూపాయల చొప్పున పెరిగింది. అయితే, ఈరోజు మార్కెట్ ప్రారంభమౌతూనే గ్రాముకు 50 రూపాయల చొప్పున తులానికి 540 రూపాయల వరకూ తగ్గుముఖం పట్టింది. అంటే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 52,470 ఉండగా, ఈరోజు మార్కెట్లో తులం బంగారం 51,930 రూపాయలకు చేరుకుంది. ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉండగా, ఈరోజు 500 రూపాయలు తగ్గి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,600 రూపాయలుకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 540 రూపాయలు తగ్గి, రూ.51,930 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

gold2.jpg

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,930 గా ఉంది. ఈరోజు   దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే జైపూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు జైపూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,080 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo