భారీగా తగ్గిన Gold Price.. ఈరోజు ఎంత తగ్గిందంటే.!

భారీగా తగ్గిన Gold Price.. ఈరోజు ఎంత తగ్గిందంటే.!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో Gold Price భారీగా పడిపోయింది

ఈ నెల ప్రారంభం నుండి దారుణంగా పెరిగిపోయిన గోల్డ్ రేట్

ఈరోజు పసిడి ప్రియులకు కొత్త ఊరట లభించింది

ఈరోజు మార్కెట్ లో Gold Price భారీగా పడిపోయింది. ఈ నెల ప్రారంభం నుండి దారుణంగా పెరిగిపోయిన గోల్డ్ రేట్ నుండి ఈరోజు పసిడి ప్రియులకు కొత్త ఊరట లభించింది. గత వారాంతంలో 75 వేల వరకూ చేరుకున్న గోల్డ్ మార్కెట్ సూచీలు, ఈరోజు భారీ నష్టాలను చూడటంతో, తిరిగి 72 వేల రూపాయల మార్క్ కు చేరుకుంది.  మరి ఈరోజు ప్రధాన మార్కెట్లో సాగుతున్న బంగారం ధర ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం పదండి.

Gold Price

ఏప్రిల్ నెల ప్రారంభం నుండి  గోల్డ్ మార్కెట్ కి శుభారంభం మొదలైంది. ఎందుకంటే, ఏప్రిల్ మొదటి నుంచి గోల్డ్ రేట్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.  ఈ నెలలో 74 వేల పైకి చేరుకొని గోల్డ్ ఎన్నడూ లేనటువంటి రికార్డు ధరను నమోదు చేసింది. జరిగిన బంగారం ధరలు గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసిన మధుపర్లకు గొప్ప లాభాలను  తెచ్చి పెట్టింది.

Today's Gold Price
Today’s Gold Price

 అయితే,  బంగారం కొనాలని చూస్తున్న పసిడి  ప్రియులకు మాత్రం  అందనంత ఎత్తులో ఎక్కి కూర్చుంది. కానీ, ఈ వారం మాత్రం  పసిడి ప్రియుల ఆశలను నెరవేరుస్తూ బంగారం ధర ఒక్కసారిగా కిందకు దిగడం మొదలు పెట్టింది. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత బంగారం ధర తిరిగి 72 వేల మార్క్ ను చేరుకుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 24 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv

Today’s Gold Price

ఇక ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న బంగారం ధరలు పరిశీలిస్తే, ఈరోజు ఒక తులం 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 73,690  వద్ద మొదలై  రూ. 72,160 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,530 రూపాయలు క్రిందకు దిగింది.

అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ కూడా రూ.1,400 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 66,150 రూపాయల వద్దకు చేరుకుంది. ఈరోజు ఉదయం రూ. 67,550 రూపాయల వద్ద ఒక తులం 22 క్యారెట్ గోల్డ్ రేట్ మొదలయ్యింది.

గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

 
Digit.in
Logo
Digit.in
Logo