first Claude ai then Chat GPT services down
ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ గా పేరొందిన చాట్ జిపిటి మరియు క్లాడ్ సర్వీస్ లో అంతరాయం కలిగింది. ముందు Cముందు Claude తర్వాత Chat GPT సర్వీస్ డౌన్ అయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సర్వీస్ డౌన్ కారణంగా చాలా సమయం ఈ రెండు ప్లాట్ ఫామ్స్ పని చేయకపోవడం తో అసహనానికి గురైన యూజర్లు సోషల్ మీడియా మొత్తం వింత వింత పోస్ట్ లతో విరుచుకుపడ్డారు.
యూజర్ రిపోర్ట్ మరియు ప్రముఖ రియల్ టైం సైట్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్, downdetector ప్రకారం కూడా ముందుగా క్లాడ్ సర్వీస్ డౌన్ అయ్యింది. ఇది జరిగిన గంటల్లోపు చాట్ జిపిటి సర్వీస్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, క్లాడ్ ఏఐ లో చాలా స్వల్పంగా సర్వీస్ ఇష్యూ చూసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఈ సిరీస్ లోపం గురించి అడపాదడపా రిపోర్ట్ అందుకుంది. అయితే, ఇది రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వందల్లో రిపోర్ట్ లను అందుకుంది.
ఇక చాట్ జిపిటి విషయానికి వస్తే, చాట్ జిపిటి సర్వీస్ డౌన్ కారణంగా యాప్ మరియు వెబ్‌సైట్ పూర్తిగా మూగబోయినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. ఇది సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో స్టార్ట్ అయ్యింది. అయితే, సమయం గడిచే కొద్దీ ఈ సర్వీస్ లోపం గురించి ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో రిపోర్ట్ అందుకోవడం గమనార్హం. దాదాపు 8 గంటల 30 నిమిషాల సమయంలో కూడా తారాస్థాయికి చేరుకుంది. అదే సమయంలో చాట్ జిపిటి డౌన్ అయినట్లు అనేకమంది యూజర్లు X వేదికగా తమ అనుభవాన్ని షేర్ చేశారు. ఆఫ్ కోర్స్ ఈ పోస్ట్ లలో కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలు కూడా ఉన్నాయనుకోండి.
Also Read: Samsung 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
OpenAI కి చెందిన Chat GPT లో పలువురు యూజర్లు లాగిన్, చాట్, ఫైల్ అప్లోడ్, వాయిస్, సెర్చ్, డీప్ రీసెర్చ్ మరియు ఇతర ఫీచర్లు ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు రిపోర్ట్ చేశారు. Downdetector లో కూడా OpenAI / చాట్ జిపిటి కు సంబంధించిన యూజర్ రిపోర్టులు భారీగా పెరిగాయి.