iPhone Duo now available with big deals
iPhone Duo ఫోన్ ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్, యాపిల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి బాటలోకి వచ్చింది. డ్యూయల్ స్క్రీన్ తో అందించిన ఈ మడతపెట్టే స్మార్ట్ ఫోన్ నిన్నటి వరకు కేవలం ముందస్తు బుకింగ్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా అందించిన బిగ్ డీల్స్ తో ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ అవుతోంది.
యాపిల్ ఈ స్మార్ట్ ఫోన్ ను నాలుగు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.
ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ స్టార్ వైట్ మరియు నైట్ స్కై అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఈరోజు నుంచి యాపిల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోన్ పైన మంచి లాంచ్ ఆఫర్లు కూడా యాపిల్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పైన ఎటువంటి వడ్డీ లేని 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ మరియు రూ. 7,000 రూపాయల తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని కూడా అందించింది. అలాగే, ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ప్లాట్ ఫామ్స్ కూడా ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించాయి.
ఈ ఫోన్ లో రెండు Super Retina XDR OLED డిస్ప్లేలు ఉన్నాయి. ఫోన్ ను తెరిచినప్పుడు 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే ఉంటుంది. ఇది 1878 × 2670 పిక్సెల్ రిజల్యూషన్, 430 ppi పిక్సెల్ డెన్సిటీ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ ను మడిచినప్పుడు 5.4 అంగుళాల ఔటర్ డిస్ప్లే లభిస్తుంది. ఇది 1398 × 2034 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 460 ppi పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. రెండు స్క్రీన్ లు కూడా ప్రో మోషన్ టెక్నాలజీ తో 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, Always-On Display, డైనమిక్ ఐల్యాండ్, HDR, True Tone, P3 వైడ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ తో USB-C తో కూడిన Apple Pencil సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది.
ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Apple A20 Pro చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 6-కోర్ CPU, 7-కోర్ GPU, రెండు 16-కోర్ Neural Engine యూనిట్లు ఉన్నాయి. అంతేకాదు, హార్డ్ వేర్ ఆధారిత రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫీచర్స్ తో భారీ యాప్లు, మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్, ఫోటో ఎడిటింగ్, AI ఆధారిత పనులు చాలా వేగంగా మరియు స్మూత్ గా నిర్వహిస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 48MP ఫ్యూజన్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో మాక్రో ఫోటోగ్రఫీ, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, Smart HDR 5, Deep Fusion, Photonic Engine, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ముందు 18MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియోలు రికార్డ్ చేస్తుంది మరియు యాపిల్ కెమెరా ఫీచర్స్ అండ్ లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Oppo ఈరోజు విడుదల చేసిన అన్ని ప్రొడక్ట్స్ ప్రైస్ అండ్ ఆఫర్స్ లిస్ట్ ఇదిగో.!
ఈ ఫోన్ లో రెండు భాగాల్లో అమర్చిన రీఛార్జ్ చేయగల లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. Apple తెలిపిన వివరాల ప్రకారం, బయటి డిస్ప్లే పై వీడియోలను ప్లే చేస్తే 44 గంటల వరకు, లోపలి డిస్ప్లే పై 31 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్ లభించవచ్చు.