Oppo ఈరోజు విడుదల చేసిన అన్ని ప్రొడక్ట్స్ ప్రైస్ అండ్ ఆఫర్స్ లిస్ట్ ఇదిగో.!

HIGHLIGHTS

Oppo ఈరోజు నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి చాలా ప్రొడక్ట్స్ రిలీజ్ చేసింది

Oppo Find X10, X10 Pro Max, Pad Mini మాట్టే డిస్ప్లే మరియు Enco X4 నాలుగు ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది

ఈ నాలుగు ప్రొడక్షన్ కూడా ప్రీమియం డివైస్ గా ప్రీమియం ప్రాసెస్ సెగ్మెంట్ లో విడుదల చేసింది

Oppo ఈరోజు నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి చాలా ప్రొడక్ట్స్ రిలీజ్ చేసింది. ఇందులో Oppo Find X10, X10 Pro Max, Pad Mini మాట్టే డిస్ప్లే మరియు Enco X4 నాలుగు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ నాలుగు ప్రొడక్షన్ కూడా ప్రీమియం డివైస్ గా ప్రీమియం ప్రాసెస్ సెగ్మెంట్ లో విడుదల చేసింది. మరి ఈరోజు ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ నాలుగు ప్రోడక్ట్ ఈ యొక్క ప్రైస్ అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Oppo Find X10

ముందుగా స్మార్ట్ ఫోన్ విభాగానికి వస్తే, ఇందులో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ గా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ ఇక్కడ చూడొచ్చు.

  • ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 139,999
  • ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 (12 జీబీ + 512 జీబీ) ప్రైస్ : రూ. 169,999

ఈ స్మార్ట్ ఫోన్ పైన 12% తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, దాదాపు ఈ ఫోన్ పైన రూ. 16,799 బ్యాంక్ డిస్కౌంట్ అందుకునే అవకాశం అందించింది. అలాగే, 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ ని కూడా అందించింది. అలాగే, రూ. 8,800 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ని కూడా అనౌన్స్ చేసింది.

Oppo Find X10 Pro Max

ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ కేవలం 12 జీబీ + 512 జీబీ సింగల్ వేరియంట్ తో మాత్రమే అందించింది. ఈ ఫోన్ ను రూ. 1,99,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది.

ఇక ఆఫర్స్ విషయాన్ని వస్తే, ఈ ఫోన్ పైన కూడా 12% తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే ఈ ఫోన్ పై రూ. 23,999 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ మరియు రూ. 8,800 రూపాయల వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లిస్ట్ చేసింది.

OPPO Enco X4

ఒప్పో ఎన్కో ఎక్స్ 4 ఇయర్ బడ్స్ ను రూ. 19,999 ధరతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్స్ పైన రూ. 1,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ మరియు 12 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ ని కూడా అందించింది. ఈ బడ్స్ ప్రీ ఆర్డర్స్ ఈరోజు నుంచి ప్రారంభం చేసింది.

Also Read: OPPO Enco X4 ఇయర్ బడ్స్ LHDC లాస్ లెస్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!

OPPO Pad Mini Matte Display Edition

ఒప్పో ఈరోజు ప్రీమియం ఫీచర్స్ తో కొత్త ట్యాబ్ కూడా రిలీజ్ చేసింది. ఈ ట్యాబ్ ఒప్పో పాడ్ ,మినీ మాట్టే డిస్ప్లే ఎడిషన్ పేరుతో రూ. 94,999 ప్రైస్ ట్యాగ్ తో రిలీజ్ చేసింది. ఈ పాడ్ కూడా ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. దీనిపై రూ. 4,749 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ మరియు 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ లను జత చేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :