Starlink Plan Price: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ ధర విడుదల చేసిన ఎలాన్ మస్క్.!
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఇండియాలో అందుబాటులోకి రావడానికి దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకుంది
ఈ శాటిలైట్ సేవలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్న వారికి ఈరోజు కొత్త అప్‌డేట్ అందించింది
స్టార్ లింక్ అధికారిక సైట్ నుంచి ఇండియాలో ఈ సర్వీస్ కోసం సెట్ చేసిన ప్లాన్ ప్రైస్ వివరాలు విడుదల చేసింది
StarLink Plan Price: అపర కుబేరుడు మరియు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ సొంతం కంపెనీ అయిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఇండియాలో అందుబాటులోకి రావడానికి దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకుంది. ఈ శాటిలైట్ సేవలు ఎప్పుడు వస్తాయి, అని ఎదురు చూస్తున్న వారికి ఈరోజు కొత్త అప్‌డేట్ అందించింది. స్టార్ లింక్ అధికారిక సైట్ నుంచి ఇండియాలో ఈ సర్వీస్ కోసం సెట్ చేసిన ప్లాన్ ప్రైస్ వివరాలు విడుదల చేసింది. స్టార్ లింక్ హాట్ హాట్ గా అందించిన ఈ కొత్త అప్‌డేట్ మరియు ప్లాన్ వివరాలు ఏమిటో చూద్దామా.
SurveyStarLink Plan Price: ప్లాన్ ధర ఏమిటి?
స్టార్ లింక్ ఇండియాలో అందించనున్న సేవలు మరియు వాటి ధర వివరాలు ఇప్పుడు అందించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ starlink.com నుంచి ఈ వివరాలు వెల్లడించింది. ఈ పేజీ లో అందించిన వివరాలు ప్రకారం, ఇండియాలో ఎలాన్ మాస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఇంటి కనెక్షన్ (హోమ్) కోసం నెలకు రూ. 8,600 రూపాయలు రుసుము సెట్ చేసింది. అంతేకాదు, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ను ఇంటికి అందించే పరికరాల కోసం రూ. 34,000 రూపాయలు అదనంగా చెల్లించాలి.

ఏంటి పైన చెప్పిన విషయం అర్ధం కాలేదా? అయితే, సింపుల్ గా చెబుతాను. మీరు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలంటే, ముందుగా రూ. 34,000 చెల్లించి డివైజ్ తీసుకుని దానికి ప్రతి నెలా రూ. 8,600 రూపాయలు ముందుగా చెల్లించాలన్న మాట. ఈ కనెక్షన్ కోసం మొదటిసారి రూ. 42,600 ఖర్చు చేయాల్సి వస్తుంది మరియు ఆ తర్వాత ప్రతి నెల రూ. 8,600 ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఈ సర్వీస్ ఇంకా రిజిస్ట్రేషన్ దశలోనే ఉంది. అంటే, మీరు ఈ కనెక్షన్ కోరుకుంటే కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఇమెయిల్ ఐడి మరియు మీ అడ్రస్ వంటి వివరాలతో కనెక్షన్ కోసం అభ్యర్ధన నమోదు చేసుకోవాలి. మీ అభ్యర్థన పరిశీలించిన కంపెనీ ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తుంది. ప్రస్తుతానికి, కంపెనీ కేవలం హోమ్ ప్లాన్ మాత్రమే వెల్లడించింది. ఒకవేళ ఈ సర్వీస్ ను బిజినెస్ కోసం కోరుకుంటే మాత్రం స్టార్ లింక్ సైట్ లో అందించిన టీమ్ ను సంప్రదించాలని సూచించారు.
Also Read: Aadhaar New Rules: ఇక నుంచి ఆధార్ జిరాక్స్ కాపీ ఇచ్చే పని లేదు..!
ఏమిటి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ లో లాభం?
శాటిలైట్ ఇంటర్నెట్ అనేది నేరుగా అంతరిక్షం నుంచి మీకు ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ఇది ఎటువంటి అంతరాయం లేని ఇంటర్నెట్ సర్వీస్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇందులో ఫిక్స్డ్ కనెక్షన్ కాకుండా మొబిలిటీ కనెక్షన్ తీసుకునే వారికి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ సర్వీస్ లభిస్తుంది. అంటే, మీరు సముద్రం నడిమధ్యలో ఉన్నా, విమానంలో ప్రయాణిస్తున్నా లేదా అమెజాన్ వంటి దండకారణ్యంలో ఉన్నా వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఎడారిలో ఉన్నా కూడా మీకు ఎటువంటి అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు అందుతాయి.
ప్రస్తుతం ఈ సర్వీస్ 400 Mbps వంటి ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ ఆఫర్ చేస్తోంది. అయితే, 2026 నుంచి ఈ సర్వీస్ ను గిగా బిట్ వేగంగా అందించబోతున్నట్లు కంపెనీ వెబ్సైట్ లో వెల్లడించింది.