ఒక 15 నిముషాలు ఫోనుతో మాట్లాడితే మన మెదడులో ఏమి జరుగుతుందో తెలుసా?
ప్రతి ఒక్కరూ కూడా రోజుకు సరాసరిన 30 నిముషాల కంటే ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతున్నారు.
మొబైల్ ఫోన్, ఇప్పుడు ఇది లేకుండా ఒక్క నిముషం కూడా గడవదేమో? అనిపిస్తుంది. అంతగా ఇది మన జీవితంలో భాగమైపోయింది. మన కుటుంబ సభ్యులు లేదా ఇష్టమైన వారు లేదా మన ఉద్యోగ రీత్యా అందరికి చేరువలో ఉండడానికి ఏకైక మార్గంగా ఇది మనకు సహాయపడుతుంది. ఒక్కటేమిటి ఇది చేయలేని పని లేదంటే ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. అయితే, దీని నుండి పొంచి ఉన్న ముప్పు కూడా ఎక్కువేనని మీకు తెలుసా?.
Surveyసాధారంగా మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా రోజుకు సరాసరిన 30 నిముషాల కంటే ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. అయితే, నిరంతరాయంగా ఒక 15 నిముషాలు ఫోనుతో మాట్లాడితే మన మెదడులో ఏమి జరుగుతుందో తెలుసా?. ఈ మొబైల్ ఫోన్ పైన చాలా దేశాలు చేసిన పరిశోధనలో ఒళ్ళు గగుర్పొడిచే అంశాలు బయటపడ్డాయి. ఇటీవల చేసిన పరిశోధనలో ఒక 15 నిముషలు ఫోన్ లో మాట్లాడిన తరువాత 'కార్టికల్ రియాక్టివిటీ' పెరిగినట్లు తెలుసుకున్నారు. అంటే, కంటి క్రియాశీలత పెరుగుతుంది.
అంతేకాదు, మన చెవికి దగ్గరగా ఫోన్ పట్టుకుని ఎక్కువ సేపు మాట్లాడం వలన, మన మెదడులోని సున్నితమైన టిస్యూలు దెబ్బతింటాయి. బ్యాటరీ చివరి పాయింట్స్ కు చేరుకున్నప్పుడు ఈ డామేజీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మన మెదడులోని నరాలు కృశించుకు పోతాయి. చిన్నపిల్లల్లో ఇది ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే, పెద్దవారి పుర్రె కన్నా చిన్నపిల్లల తల భాగం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఈ తరంగాలు నేరుగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, ఇటువంటి మొబైల్ ఫోన్ నుండి మనల్ని కాపాడుకోవడనికి ఈ క్రింద జాగ్రత్తలు తీసుకుంటే, ఈ ప్రభావాన్ని పూర్తిగా నివారించక పోయినా కూడా చాల వరకు తగ్గించవచ్చు.
-
పాటించాల్సిన జాగ్రత్తలు
1. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నాము కాబట్టి, వీలైనంత వరకు కాలింగ్ కి బదులుగా టెక్స్ట్ సందేశాలను పంపడం, లేదా ఫోన్ నుండి కాల్స్ చేయాల్సివచ్చినపుడు బ్లూటూత్ హెడ్ సెట్ లేదా, ఇయర్ ఫోన్స్ వాడడం ద్వారా చాలా వరకు రేడియేషన్ నుండి తప్పిచుకోవచ్చు. ఎలాగంటే, ఫోన్ మాట్లాడేటప్పుడు మన మెదడుకు ద్గగరగా ఫోనులో వుండే యాంటెన్నాఉంటుంది కాబట్టి అది నేరుగా మన మెదడు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. పైన తెలిపిన ప్రత్యామ్నాయాల వలన ఫోన్ మన తలకు దూరంగా ఉంటుంది కాబట్టి చాల వరకు రేడియేషన్ తప్పించుకోవచ్చు.
2. అనవసర ఫోన్ వాడకాన్ని తగ్గిచుకోవడం : "అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది" అనే సామెత ఇక్కడ కచ్చితంగా నిజమవుతుంది. అతిగా ఫోన్ వాడకం, మీకు ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కేవలం, రేడియేషన్ ప్రమాదమే కాకుండా వత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుందని U.S కి చెందిన, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) 2011 వ సంవత్సరంలోనే దీని గురించి తెలిపింది. కాబట్టి, మీకు అవసంరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
3. రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఫోన్లను ఒక అలారంలా వాడుతున్నారు. ఇది చాల చిన్న విషయం కదా, అనుకుంటున్నారా ? కాదు, మీరు అలారం పెట్టి ఫోన్ మీ తల దగ్గర పెట్టి పడుకుంటారు అప్పుడు అత్యధికమైన రేడియేషన్ మీరు అందుకుంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో ఉన్నాసరే దానిలోని యాంటెన్నా మరియు బ్యాటరీ కూడా రేడియేషన్ వెదజల్లుతూనే ఉంటాయి. కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం.
4. సిగ్నల్ సరిగ్గా లేనపుడు ఫోన్ వాడకం తగ్గించాలి : ఫోన్ లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే, సిగ్నల్ వీక్ గా ఉన్నపుడూ మన ఫోన్ లోనీ యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యదికంగా తరంగాలను విడుదల చేస్తుంది కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తవహించండి.
5. మీతో మీ ఫోన్ను అంటిపెట్టుకుని ఉండటాన్ని తగ్గించండి: ఫోన్ను జేబులో లేదా పౌచ్ తో పాటుగా ఎల్లపుడు మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్నితగ్గించండి. ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు ఫోన్ పెట్టుకోవడం ద్వారా మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి , మీఫోనుతో పనిలేనప్పుడు మీ నుండి కొంత దూరంలో ఉండేలా చూసుకోండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile