Whatsapp: మీ అకౌంట్ లో ఈ మిస్టేక్స్ చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని తెలుసా.!

Whatsapp: మీ అకౌంట్ లో ఈ మిస్టేక్స్ చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని తెలుసా.!
HIGHLIGHTS

ఈ తప్పులు చేస్తే వాట్సాప్ వారి అకౌంట్ ను బ్యాన్ చేస్తుంది

వాట్సాప్ యూజర్లు వారికి తెలియకుండా ఈ తప్పులు చేసిన క్షమించదు

ఎటువంటి పనులు చేస్తే మిమ్మల్ని వాట్సాప్ నిషేధించగలదో తెలుసుకోండి

వాట్సాప్ యూజర్లు వారికి తెలియకుండా లేదా అనుకోకుండా అయినా సరే ఈ తప్పులు చేస్తే వాట్సాప్ వారి అకౌంట్ ను బ్యాన్ చేస్తుందని మీకు తెలుసా? ఒకవేళ తెలియక పొతే ఇప్పుడు తెలుసుకోండి. అవాంఛిత అకౌంట్స్ లేదా వాట్సాప్ షరతుల ఉల్లంఘన చేసే అకౌంట్స్ ను తొలిగించడం, లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించడం వలెనే మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది. అయితే, మీరు వాటిని ఉల్లంఘిస్తే, మీరు వాట్సాప్ నుండి వెంటనే నిషేధించబడవచ్చు. అందుకే, వాట్సాప్‌లో ఎటువంటి పనులు చేస్తే మిమ్మల్ని వాట్సాప్ నిషేధించగలదు అనే విషయాలను గురించి తెలుసుకుందాం.

తప్పు మెసేజ్ పంపడం

మీరు మెసేజెస్ ను అడ్డుకోవడానికి ఎవరైనా మీ వాట్సాప్‌ అకౌంట్ నుండి వచ్చే మెసేజీలు పంపకుండా బ్లాక్ చేస్తే, మీరు వెంటనే ఆ పనిని ఆపివేయాలి. ఒకేవేళ మీరు అలా చెయ్యకపోతే, మరింకెవరినా వాట్సాప్ యూజర్ మీ మీద ఫిర్యాదును నమోదు చేస్తే, మీ WhatsApp ఖాతా నిషేధించబడవచ్చు.

తర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం

WhatsApp Plus లేదా GB WhatsApp వంటి థర్డ్ పార్టీ యాప్‌ లను ఉపయోగించడం వలన మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ టార్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగిస్తున్న కారణంగా కూడా మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ చేయబడవచ్చు. వాస్తవానికి, వాట్సాప్ ప్లస్ వెబ్‌సైట్‌లో వాట్సాప్ ప్లస్ అనేది వాట్సాప్ డెవలప్ చేయని యాప్ అని మరియు వాటికీ వాట్సాప్‌ పై ఎలాంటి హక్కులు లేవని కూడా స్పష్టంగా రాసి ఉంటుంది.

బ్రాడ్ కాస్ట్ లిస్ట్ యొక్క అధిక వినియోగం

బ్రాడ్ కాస్ట్ మెసేజీలను అతిగా లేదా నిరంతరం ఉపయోగించడం వల్ల కూడా మీ అకౌంట్ కు చేటువాటిల్లవచ్చు. ఎందుకంటే, ఆలా చేయడం వలన ఇతరలు మీ మెసేజీల గురించి రిపోర్ట్ చెయవచ్చు. ఒకవేళ అలాచేస్తే మీ వాట్సాప్ అకౌంట్ నిషేధాలకు దారితీయవచ్చని WhatsApp చెబుతోంది.

Fake అకౌంట్ క్రియేట్ చేయడం

వాట్సాప్‌లో Fake అకౌంట్ క్రియేట్ చేయడం లేదా మరొకరి అకౌంట్ ను కాపీ చేయడం వంటివి చాలా తీవ్రమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇది తరచుగా WhatsApp బిజినెస్ అకౌంట్ వినియోగదారులతో జరుగుతుంది. మీరు ఇలా చేస్తే WhatsApp ,ఈ అకౌంట్ ను బ్లాక్ చేస్తుంది.

ఆటొమ్యాటిక్ లేదా బల్క్ మెసేజీలు పంపడం

మీరు మీ వాట్సాప్ అకౌంట్ ద్వారా బల్క్ మెసేజ్, ఆటో-మెసేజ్ లేదా ఆటో-డయల్ చేస్తే, వాట్సాప్ మిమ్మల్ని అలా చేయడానికి అనుమతించదు.

వైరస్ లేదా మాల్వేర్ పంపడం

మీరు వాట్సాప్‌లో హానికరమైన ఫైల్‌లను పంపినట్లయితే, అది ప్రజలకు హాని కలిగించవచ్చు. అందుకే , అలా చేసినందుకు మీరు వాట్సాప్‌ నుండి  నిషేధించబడవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo