ముంబైలో జరిగిన Digit Squad Tech Day విజయవంతం : భారతదేశంలో అతిపెద్ద టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్

ముంబైలో జరిగిన Digit Squad Tech Day విజయవంతం : భారతదేశంలో అతిపెద్ద టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్
HIGHLIGHTS

ఆగస్టు 18 న ముంబైలో జరిగిన " Digit Squad Tech Day " భారీ విజయాన్ని సాధించినందుకు మేము డిజిట్ టీం గా గర్విస్తున్నాము.

ఈ కార్యక్రమం భారతీయ టెక్ వ్యవస్థాపకులను శక్తివంతం చేసే లక్ష్యంతో డిజిట్ చొరవతో # ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించడాన్ని కూడా సూచిస్తుంది.

తదుపరి డిజిట్ స్క్వాడ్ టెక్ డే ఆగస్టు 25 న బెంగళూరులో జరగనుంది.

ప్రతిరోజూ టెక్ న్యూస్ రిపోర్టర్లు ప్రజల కోసం టెక్నాలజీ వార్తలను అందిస్తారు. అయితే, ఒక చిరస్మరణీయ సందర్భంలో, ఆగస్టు 18 న ముంబైలో జరిగిన " Digit Squad Tech Day " భారీ విజయాన్ని సాధించినందుకు మేము డిజిట్ టీం గా గర్విస్తున్నాము. డిజిట్ యొక్క రెండు పెద్ద కార్యాలయాల నుండి దాదాపుగా  ప్రతి సభ్యుడిచే హోస్ట్ చేయబడిన మరియు ఆర్కెస్ట్రేట్ చేయబడిన, ముంబైలోని డిజిట్ స్క్వాడ్ టెక్ డే , మూడవసారి దేశంలోని అతిపెద్ద టెక్ టెక్  ఓత్సాహికులను మరియు మైక్రో-ఇన్ఫ్లుయెన్సర్‌ల కోసం మరొక రోజు సరదాగా నిండిన సాంకేతిక అనుభవాల కోసం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం భారతీయ టెక్ వ్యవస్థాపకులను శక్తివంతం చేసే లక్ష్యంతో డిజిట్ చొరవతో  # ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించడాన్ని కూడా సూచిస్తుంది.

టెక్ ఓత్సాహికులకు మరియు మైక్రో-ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఒక రోజును మధురానుభూతిగా నింపేలా పనిచేయడమే కాకుండా, ముంబైలో దేశంలోని అతిపెద్ద డిజిట్ స్క్వాడ్ టెక్ డే  సోనీ, ఇంటెల్, వన్‌ప్లస్, శామ్‌సంగ్, అసుస్ వంటి ప్రముఖ బ్రాండ్లచే స్పాన్సర్ చేయబడిన తాజా గేమింగ్ గేర్‌ లకు నిలయమైంది. అలాగే,  ఎన్విడియా, AMD మరియు ఇతర హెవీ గేమింగ్ పరికరాలను,  బఫేలో వంటకాల వలె వారికోసం పరిచింది. అంతేకాదు,  ఈ హై-ఎండ్ గేమింగ్ పరికరాల వేదిక వద్ద ఉన్న 60 కంటే ఎక్కువ మంది స్క్వాడ్ సభ్యులు, టెక్ ఔత్సాహికులకు సాధారణంగా యాక్సెస్ లేని సాంకేతికతను వారు నేరుగా అనుభవించే అవకాశాన్ని అందించారు. అధనంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా,  డిజిట్‌లోని సంపాదకీయ బృందంతో సంభాషించే హక్కు కూడా సభ్యులకు ఇచ్చారు, ఇక్కడ ఉన్న పరిజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం అనుభవాన్ని పూర్తి అంచుల వరకూ వారికి చవిచూపించారు.

“సాంప్రదాయ ప్రకటనలు మరియు మార్కెటింగ్‌కు అంతకుమించి, నేటి ప్రముఖ వినియోగదారు టెక్నాలజీ బ్రాండ్స్ తమ ప్రేక్షకులతో మరింత అనుసంధానించబడిన మరియు సమర్థవంతమైన మార్గంలో విశ్వసనీయమైన అభిప్రాయ నాయకుల ద్వారా పాల్గొనాలని కోరుకుంటాయి. డిజిట్ స్క్వాడ్ సభ్యులకు అందుబాటులో లేని సరికొత్త గాడ్జెట్‌లకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా,  ప్రభావవంతమైన వారికి తాజా సాంకేతిక పరిజ్ఞానాలతో మునిగి తేలేందుకు మరియు వారి చందాదారులతో పంచుకోవడానికి ప్రత్యక్ష అనుభవాలను మెరుగుపర్చడానికి మేము సహాయం చేస్తున్నాము ”అని డిజిట్‌లోని స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ అరుణ్ యాదవ్ వ్యాఖ్యానించారు.

# ఇండియాప్రాజెక్ట్ అనేది డిజిట్ చొరవతో, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న టెక్ వ్యవస్థాపకులకు వారి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్రాపర్టీలలో ఉచిత ప్రకటనల స్థలం మరియు బ్రాండ్ ప్రమోషన్ పేజీలను అందించడం ద్వారా వారికి సహాయపడటం వంటివి చేస్తుంది. "ఈ వేగవంతమైన పోటీ ప్రపంచంలో వర్ధమాన టెక్ వ్యవస్థాపకులు ఎదుర్కొంటున్న సవాళ్లను మేము అర్థం చేసుకున్నాము మరియు ఈ చొరవ ద్వారా వారిని శక్తివంతంగా చేయాలనుకుంటున్నాము. స్థానిక టెక్ వ్యవస్థాపకులను చేరుకోవడానికి ప్రతి రాష్ట్రం మరియు UT (కేంద్రపాలిత ప్రాంతాలలో) లలో ఒక నెల లేదా రెండు రోజులు కేటాయించాలని మరియు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఉనికి ద్వారా దేశంలో బలమైన పాఠకుల ద్వారా వారి వ్యాపారాన్ని పెంచుకోవడంలో సహాయపడాలని మేము యోచిస్తున్నాము, ”అని కూడా  యాదవ్ తెలిపారు.

ముంబైలో జరిగిన డిజిట్ స్క్వాడ్ టెక్ డే ఈ ఏడాది జూన్ నుంచి దేశవ్యాప్తంగా జరిగే టెక్ డే ఈవెంట్లలో మూడవ విడతగా జరిగింది. మొదటి ఈవెంట్ డిజిట్ కార్యాలయంలోనే జరిగగా, రెండవది ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలోని ఒక పెద్ద వేదికలో టెస్ట్ రైడ్ లకు మరింత గేమింగ్ గాడ్జెట్లు మరియు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లతో జరిగింది. ఇప్పుడు ఈ సీజన్ కోసం ముంబై కవర్ చేయడంతో, తదుపరి డిజిట్ స్క్వాడ్ టెక్ డే ఆగస్టు 25 న బెంగళూరులో జరగనుంది. డిజిట్  SQUAD అనేది దేశం యొక్క అతిపెద్ద టెక్ ఓత్సాహికులు మరియు మైక్రో-ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు  మాత్రమే ఒక  ప్రత్యేకమైన ఆహ్వానం సంఘం. మీరు ఇక్కడ డిజిట్ SQUAD గురించి మరియు #IndiaProject గురించి మరింత తెలుసుకోవచ్చు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo