ఈ సెట్టింగ్స్ చేస్తే మీ Old Phone రాకెట్ వేగంతో New Phone పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.!

HIGHLIGHTS

కొన్ని సెట్టింగ్స్ మార్పు చేస్తే మీ Old Phone రాకెట్ వేగంతో New Phone పెర్ఫార్మెన్స్ అందిస్తుంది

మీరు మళ్ళీ మీ పాత ఫోన్ లో వేగవంతమైన కొత్త పెర్ఫార్మెన్స్ పొందవచ్చు

మీ ఫోన్ సెట్టింగ్స్ లో చిన్న మార్పులు చేయడం ద్వారా ఫోన్ వేగం పెంచవచ్చు

ఈ సెట్టింగ్స్ చేస్తే మీ Old Phone రాకెట్ వేగంతో New Phone పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.!

ఎంతో ఆలోచించి తర్జన భర్జన పడి అన్ని ఫీచర్స్ కలిగిన ఒక కొత్త ఫోన్ కొంటాము. కొత్త ఫోన్ కొన్నప్పుడు సూపర్ స్పీడ్ తో గొప్ప పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అయితే, రోజులు గడిచే కొద్దీ ఫోన్ పర్ఫార్మెన్స్ మెల్లమెల్లగా అధఃపాతాళానికి పడిపోతుంది. అనుకున్న ప్రతిసారీ కొత్త ఫోన్ కొనాలంటే చాలా కష్టం అవుతుంది. ఆఫ్ కోర్స్, పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేసి కొత్త ఫోన్ కొనాలంటే ఈజీ అనుకోండి. కానీ, చాలా మంది కూడా పాత ఫోన్ తో సరిపెట్టుకుంటున్నారు. అయితే, కొన్ని సెట్టింగ్స్ మార్పు చేస్తే మీ Old Phone రాకెట్ వేగంతో New Phone పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంటే, మీరు మళ్ళీ మీ ఫోన్ లో వేగవంతమైన కొత్త పెర్ఫార్మెన్స్ పొందవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Old Phone ని New Phone చేసే ఆ సెట్టింగ్స్ ఏమిటి?

మీ ఫోన్ సెట్టింగ్స్ లో చిన్న మార్పులు చేయడం మరియు చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా ఫోన్ వేగం పెంచవచ్చు. వాస్తవానికి, ఫోన్ సెట్టింగ్‌లు ఆప్టిమైజ్ చేయకపోవడమే ఫోన్ నెమ్మదించడానికి ప్రధాన కారణం. ఈరోజు ఆ బెస్ట్ సెట్టింగ్స్ మరియు టిప్స్ వివరంగా చూద్దాం.

బ్యాగ్రౌండ్ యాప్స్ పరిమితం చేయండి

మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో నడిచే కొన్ని యాప్స్ మీ ఫోన్ వేగాన్ని చాలా వరకు తగ్గించేస్తాయి. అందుకే, ఈ మీ ఫోన్ లో వెనుక రన్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ని ఆఫ్ చేయండి. దీనికోసం మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Apps లోకి వెళ్లి Running services ను ఎంచుకొని అవసరం లేని యాప్స్ స్టాప్ చేయండి.

యానిమేషన్ స్పీడ్ తగ్గించండి

మీ ఫోన్ లో యానిమేషన్ మెల్లగా ఉంటే UI నెమ్మదిగా అనిపిస్తుంది. అందుకే, మీ ఫోన్ డెవలపర్ ఆప్షన్స్‌లో యానిమేషన్ స్కేల్ ను 0.5x కి సెట్ చేయండి. ఇందులో విండో యానిమేషన్ స్కేల్ 0.5x కి, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ 0.5x కి మరియు యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ కూడా 0.5x కి సెట్ చేయండి. ఈ సెట్టింగ్స్ తర్వాత మీ ఫోన్ వేగంగా మారినట్లు కనిపిస్తుంది.

Cached Data క్లీన్ చేయండి

మీ ఫోన్ లో కాషే డేటా ఎక్కువైతే కూడా మీ ఫోన్ స్లో అవుతుంది. అందుకే, మీ ఫోన్ లో కాషే డేటా క్లియర్ చేయండి. ఇక్కడ మీరు బాగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మీరు డేటా కాషే ని క్లియర్ మాత్రమే చేయాలి డిలీట్ చేయకూడదు. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ కేటగిరిలో Cached data ఎంచుకొని క్లియర్ పై క్లిక్ చేయండి.

ఉపయోగం లేని యాప్స్ డిలీట్ చేయండి

మీ ఫోన్ లో అనేక యాప్స్ మీరు డౌన్ లోడ్ చేసి ఉంటారు. మీరు ఇన్స్టాల్ చేసిన అన్గాన్ని యాప్స్ కూడా ర్యామ్ చేసే పనిలో భాగం పంచుకుంటాయి. అందుకే, ఈ ఫోన్ లో ఉపయోగం లేని యాప్స్ డిలీట్ చేయండి. తద్వారా మీ ఫోన్ ర్యామ్ పై లోడ్ తగ్గుతుంది మరియు మీ ఫోన్ వేగం అవుతుంది.

Old Phone to New Phone

లైట్ యాప్ ఉపయోగించండి

మీ ఫోన్ లో మీకు అవసరమైన యాప్స్ ఇన్స్టాల్ చేసే సమయంలో లైట్ యాప్ ఉపయోగించండి. డి చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది మరియు వేగంగా పని చేయడమే కాకుండా మీ ఫోన్ ర్యామ్ పై భారం తగ్గిస్తుంది. ఇది మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ పెంచుతుంది. ( Facebook lite, Instagram Lite, Google Go apps మరియు మరిన్ని యాప్స్)

ఆటో సింక్ ఆఫ్ చేయండి

ఎక్కువ మంది ఫోన్ యూజర్లు చేసే తప్పు ఇదే. ఆటో సింక్ అయ్యే యాప్స్ ఫోన్ బ్యాగ్రౌండ్ రన్ అవుతూ ఫోన్ వేగం తగ్గించేస్తాయి. అందుకే, ఆటో సింక్ ఆఫ్ చేయండి. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసి ఆటో సింక్ ఆఫ్ చేయండి.

Also Read: Nothing Phone (3a) Lite లాంచ్ డేట్ ప్రకటించిన నథింగ్.!

బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆన్ చేయండి

ఇది ఆండ్రాయిడ్ ఫోన్ లలో డీఫాల్ట్ గా వచ్చే ఫీచర్స్ మరియు ఈ ఫీచర్ ఆన్ చేస్తే బ్యాగ్రౌండ్ లో నడిచే యాప్స్ ని అడ్డుకుంటుంది. ఇలా ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ మీ ఫోన్ లో సెట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్ వేగంగా పెంచుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo