మీ Phone Hang అవ్వకుండా కాపాడే ఈ బెస్ట్ మెయింటెనెన్స్ ట్రిక్స్ గురించి మీకు తెలుసా.!

HIGHLIGHTS

ఎంత కొత్త ఫోన్ అయినా సరే కొన్ని రోజులకు నెమ్మదిస్తుంది

ఫోన్ వాడకాన్ని బట్టి కొన్ని సార్లు Phone Hang అయ్యే అవకాశం ఉంటుంది

కంట్రోల్ ని సరైన ట్యూన్ తో కంట్రోల్ చేస్తే ఫోన్‌ హ్యాంగ్ సమస్య చాలా వరకు తగ్గుతుంది

మీ Phone Hang అవ్వకుండా కాపాడే ఈ బెస్ట్ మెయింటెనెన్స్ ట్రిక్స్ గురించి మీకు తెలుసా.!

ఎంత కొత్త ఫోన్ అయినా సరే కొన్ని రోజులకు నెమ్మదిస్తుంది. ఫోన్ వాడకాన్ని బట్టి కొన్ని సార్లు Phone Hang అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా అని ఫోన్ నెమ్మదించిన లేదా హ్యాంగ్ ఐన ప్రతిసారి కొత్త ఫోన్ కొనలేము. అయితే, ఫోన్ లో ఉండే కొన్ని ట్రిక్స్ తో ఫోన్ చాలా కాలం వేగంగా ఉంచడానికి వీలవుతుంది. అంతేకాదు, ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా గొప్ప పెర్ఫార్మెన్స్ కూడా పొందవచ్చు. ఎలాగంటే, ఫోన్ లో ఉండే కొన్ని ప్రత్యేకమైన కంట్రోల్ ని సరైన ట్యూన్ తో కంట్రోల్ చేస్తే ఫోన్‌ హ్యాంగ్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫోన్ Cache Data రెగ్యులర్ గా క్లియర్ చేయండి

ఫోన్ లో యాప్‌ లు ఉపయోగించేటప్పుడు Cache పేరుతో తాత్కాలిక డేటా మీ ఫోన్‌ లో సేవ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఫోన్ RAM మీద లోడ్ పెరిగి ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అందుకే, రెగ్యులర్ గా కాష్ డేటా క్లియర్ చేయండి.

ఫోన్ స్టోరేజ్‌ 80% కంటే ఎక్కువ నింపకండి

ఫోన్ స్టోరేజ్ పూర్తిగా నింపడం వల్ల ఫోన్ లో ఫైల్స్ ఓపెన్ కావడానికి సమయం పడుతుంది. అంటే ఈ ప్రాసెస్ లో ఫోన్ హ్యాంగ్ అవ్వడం లేదా చాలా నెమ్మదించడం వంటివి జరుగుతుంది. అందుకే, మీ ఫోన్ లో ఎప్పుడూ 20% స్టోరేజ్ ఖాళీగా ఉంచండి. ఫోన్ లో ఎక్కువగా స్టోరేజ్ ఉంటే క్లౌడ్ లో సేవ్ చేయండి.

వారానికి ఒకసారి ఫోన్‌ రీస్టార్ట్ చేయండి

ఫోన్ రీస్టార్ట్ చేసినప్పుడు ఫోన్ లో ఉన్న ర్యామ్ రిఫ్రెష్ అవుతుంది. అంతేకాదు, ఫోన్ లో ఉండే బగ్‌లు మరియు గ్లిచ్‌ లు తొలగుతాయి. ఇలా చేయడం ద్వారా ఫోన్ స్పీడ్‌ 15–25% వరకూ మెరుగుపరుస్తుంది. అందుకే వారినికి ఒకసారి వారానికి ఒకసారి ఫోన్‌ రీస్టార్ట్ చేయండి.

ఫోన్ లో Auto-Start Apps‌ ఆఫ్ చేయండి

ఫోన్ ఆన్ చేసిన వెంటనే చాలా యాప్‌లు వాటంతట అవే ఆటోమేటిక్‌గా రన్ అవుతాయి. ఇవి RAM‌ ను ఎక్కువగా ఉపయోగిస్తాయి మరియు ఫోన్ ను హ్యాంగ్ సమస్యను పెంచుతాయి. అందుకే, ఫోన్లో ఆటో స్టార్ట్ యాప్స్ ఆఫ్ చేయండి. దీనికోసం మీ ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్ళి యాప్స్ ఎంచుకొని అందులో ఆటో స్టార్ట్ డిజేబుల్ చేయండి.

Phone Hang Best Tricks

Virus/Adware స్కాన్ చేయండి

ఫోన్ లో ఉండే అన్ సేఫ్ యాప్స్ ఫోన్ ని బాగా స్లో చేస్తాయి. అందుకే, ఫోన్ లో Google Play Protect ని ఆన్‌లో ఉంచండి.

Also Read: Best Tv Deal: కేవలం 55 ఇంచ్ టీవీ ప్రైస్ లో 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

ఉపయోగించని యాప్స్ తొలగించండి

చాలా మంది యూజర్లు వారి స్మార్ట్‌ ఫోన్‌ లో 30–40% యాప్‌లు యూజర్లు అసలు ఉపయోగించరని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ యాప్స్ వాడకపోయినా బ్యాగ్రౌండ్ లో రన్ అవుతూ ఫోన్ ను స్లో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఫోన్ లో ఉపయోగించని యాప్స్ డిలీట్ చేయడం ద్వారా ఫోన్ వేగంగా పెంచవచ్చు.

రెగ్యులర్ గా యాప్ అప్‌డేట్‌ చేయండి

ఫోన్ యాప్స్ అప్‌డేట్‌ తో బగ్ ఫిక్స్‌ మరియు ఆప్టిమైజేషన్ వంటివి నిర్వహించబడతాయి. ఇది ఫోన్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

ఈ విధంగా మీ ఫోన్ లో ఏ టిప్స్ పాటించాలి. తద్వారా, మీ ఫోన్ ను ఎల్లప్పుడు వేగంగా ఉంచేలా చూడటానికి అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile