apple announces Apple Surprise and shine Event what to expect
Apple Surprise and shine Event: యావత్ ప్రపంచం ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ఆపిల్ అతిపెద్ద ఈవెంట్ లాంచింగ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఈవెంట్ నుంచి ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు మరియు ఇతర డివైజ్ లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరియు ఈ లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ వినగానే వారి ఆనందం రెట్టింపు అవుతుంది. ఇప్పటికే ఐఫోన్ 18 సిరీస్ ఫోన్స్ గురించి మార్కెట్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ లాంచ్ డేట్ అనౌన్స్ తో ఈ చర్చ మరింత తారాస్థాయికి చేరుకుంది.
యాపిల్ సర్‌ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్ ఉదయం 10 గంటలకు కాలిఫోర్నియాలోని యాపిల్ యొక్క ప్రధాన కార్యాలయం, యాపిల్ పార్క్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.
యాపిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నిర్వహించే ఈ అతి పెద్ద ఈవెంట్ నుంచి ఐఫోన్, ఎయిర్ పాడ్స్ మరియు యాపిల్ వాచీలు విడుదల చేయడం పరిపాటిగా మారింది. 2026 సెప్టెంబర్ లో నిర్వహించనున్న ఈ ఈవెంట్ నుంచి కూడా యాపిల్ కొత్త సిరీస్ ఫోన్లు మరియు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది.
యాపిల్ నిర్వహించనున్న ఈ బిగ్ ఈవెంట్ నుంచి ఐఫోన్ 18 సిరీస్ నుంచి లాంచ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఈసారి యాపిల్ నిర్వహించనున్న ఈ బిగ్ ఈవెంట్ లో యాపిల్ సర్ప్రైజ్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెవులు కోరుకుంటున్నారు. అదే, యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా మరియు ఇది ఈ ఈవెంట్ ని తారా స్థాయికి తీసుకెళ్లే అనౌన్స్ కావచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: జస్ట్ 55 ఇంచ్ టీవీ రేటుకే 75 ఇంచ్ QLED Smart Tv లభిస్తుంది .. ఎక్కడ భయ్యా ఈ ఆఫర్.!
అయితే, ఈ ఫోన్ లాంచ్ మరియు ఇతర ఐఫోన్ 18 సిరీస్ గురించి ప్రస్తుతం నెట్టింట్లో నడుస్తున్న మొత్తం అంచనా వివరాలు మాత్రం అని గమనించాలి. మనం కూడా ఈ అప్ కమింగ్ ఈవెంట్ గురించి చెబుతున్న విషయాలు అంచనా వివరాలు మాత్రమే అని గమనించాలి.