AMD త్రెడ్రిప్పర్ 2 ని ప్రకటించారు,32-కోర్ టీ ఆర్ 2990 WX ఇంటెల్ కోర్ i9-7980XE ని 53% తో బీట్ చేసింది

AMD త్రెడ్రిప్పర్ 2 ని ప్రకటించారు,32-కోర్ టీ ఆర్ 2990 WX ఇంటెల్ కోర్ i9-7980XE ని 53% తో బీట్ చేసింది
HIGHLIGHTS

AMD త్రెడ్రిప్పర్ 2 వరుసగా 32,24,16 మరియు 12 కోర్ ఫీచర్స్ సీపీయూ లు రానున్నాయి. 32-కోర్ TR 2990WX రూ . 1,25,990+టాక్స్ గా ఉండవచ్చు.

COMPUTEX 2018 విలేకరుల సమావేశంలో AMD చేసిన కీ ప్రకటనలు  2 వ జనరేషన్ త్రెడ్రిప్పర్ CPU లు ఇప్పుడు  చివరికి ఇక్కడ అందించనున్నారు. ఈ ప్యాక్ ని ప్రధానంగా 3GHz యొక్క క్లాక్ దాసితో 32-కోర్ TR 2990WX మరియు 4.2 GHz యొక్క క్లాక్ బూస్ట్ ఉంటాయి. ఇది 250 W యొక్క TDP గా ఉంది ఈరోజుల్లో  ఇది చాలా డిమాండ్ కలిగిన  కొన్నిగ్రాఫిక్స్ కంటే కూడా ఎక్కువ. ఈ నిర్మాణానికి ధర? $ 1,799 లేదా రూ .1,25,990 + టాక్స్ గా ఉండవచ్చు. దీని పూర్తి లైనప్ ఇక్కడ ఇవ్వబడింది. 2 వ జనరల్ త్రెడ్రిప్పర్ CPU ల కోసం ప్రీ-ఆర్డర్లు నేటి నుంచి అందుబాటులో వున్నాయి మరియు  ఆగష్టు 13 వ తేదీకి రిటైల్ లభ్యతతో ప్రారంభం కానున్నాయి. భారతీయ ధరలను మాత్రం TR 2990WX కోసం మాత్రమే అందించింది మరియు ఇతర వాటికోసం కాదు.    

ఇంటెల్ యొక్క రాబోయే HEDT CPU లకు పోటీగా కోర్ దీని సంఖ్య గణనీయంగా పెరిగింది. మరియు దీనిని గమనించి నట్లయితే , AMD దాని SKUs ను ధరల పరంగా కూడా పోటీ ఉంచింది. టాప్ SKU కోసం $ 1,799 రేటు వద్ద వుంది,అది కూడా ఒక  32-కోర్ కోసం,అలాగయితే  ఇంటెల్ త్రెడ్రిప్పర్ ని ఓడించడం చాలా కష్టం. ఇంటెల్ కంప్యూటెక్స్ 2018 లో 28-కోర్ CPU ని ప్రదర్శించింది మరియు వారు పోటీ పడాలంటే కేవలం స్వచ్ఛమైన కోర్-కౌంట్లో మాత్రమే వారు తమ ప్రదర్శను అందించాల్సి ఉంటుంది.

ఈ 2990WX నాలుగు Zen + Zeppelin ఒక్క డైస్ AMD యొక్క ఇన్ఫినిటీ ఫ్యాబ్రిక్ ఉపయోగించి ప్రతి ఒక దానితో మరొక దానిని  కనెక్ట్ చేసారు . ప్రతి డైస్ 8 కోర్ల తో మొత్తం 32 కోర్లను ఇస్తుంది. అదేవిధంగా, 2970WX కూడా ఇదే కాన్ఫిగరేషన్ ని  కలిగి ఉంటుంది కానీ అన్ని కోర్లను ఉపయోగించరు. CCX కు ఒక కోర్ డిసేబుల్ చెయ్యబడింది, కాబట్టి ప్రతి డైలో మొత్తం 6 కీలక కోర్సులతో కలిపి 24 మొత్తం కోర్ కౌంట్లో ఉంటాయి.

ఈ రెండు 'WX' ప్రాసెసర్లే  కాకుండా, AMD  త్రెడ్రిప్పర్ 2 కూడా రెండు ఎక్కువ SKU లను (2950X మరియు 2920X) కలిగి ఉంది, ఇది కేవలం సాంప్రదాయ 'X' ప్రత్యామ్న్యాయంతో ఉంది, ఇది ప్రస్తుతం ఉన్న 1950X మరియు 1920X CPU ల స్థానంలో ఉంది. వీటి కోర్ కౌంట్లు ఒకే విధంగా ఉంటాయి, అంటే వరుసగా 2950X మరియు 2920X కోసం 16 మరియు 12 కోర్లు ఉన్నాయి. మైక్రో ఆర్కిటెక్చర్లో అభివృద్ధి కారణంగా ఈ రెడింటి కోసం కోసం బూస్ట్ గడియారాలు మెరుగుపడ్డాయి.

AMD TR 2990WX బీట్స్ ఇంటెల్ కోర్ i9-7980XE

 

AMD ఫ్రాన్స్ అనుకోకుండా 32-కోర్ TR 2990WX యొక్క బెంచ్ మార్క్ను వెల్లడించింది మరియు సినిబెంచ్  R15 మల్టిత్రెడెడ్ విభాగంలో 5099 స్కోర్ తో, ఇంటెల్ కోర్ i9-7980XE ను 53.5% తేడాతో బీట్ చేసింది. ఇది ఇంటెల్ HEDT కిరీటంను తిరిగి పొందటానకి  భారీగా విజయం సాధించిన భారీ నాయకత్వం.

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo