Amazon Great Republic Day sale ను అమెజాన్ అనౌన్స్ చేసింది. 2020 సంవత్సరం యొక్క మొదటి మరియు అతిపెద్ద సేల్ జనవరి 13వ తేదీ నుంచి మొదలవుతుంది. అయితే, అమెజాన్ ఈ సేల్ నుంచి అందించనున్న కొన్ని బెస్ట్ డీల్స్ ని ఈరోజు రివీల్ చేసింది. ముఖ్యంగా ఇందులో అమెజాన్ యొక్క సొంత ప్రోడక్ట్ ఉన్నాయి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Great Republic Day sale : డీల్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి అమెజాన్ యొక్క ఫైర్ టీవీ స్టిక్ మరియు అలెక్సా పై స్పీకర్స్ అందించబోతున్నట్లు అమెజాన్ అనౌన్స్ చేసింది. అక్కడి నుంచి అమెజాన్ సేల్ నుంచి ఈ ప్రొడక్ట్స్ ను డిస్కౌంట్ ధరకే పొందవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఇందులో ముఖ్యంగా Alexa Devices ను చాలా తక్కువ అందుకోవచ్చని చెబుతోంది. అమెజాన్ ఈరోజు రివీల్ చేసిన డీల్స్ లో బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి Amazon Echo Pop ను అముఞ్చి డిస్కౌంట్ ధరకు పొందవచ్చని చెబుతోంది. ఎకో పాప్ అలెక్సా స్మార్ట్ స్పీకర్ ఈరోజు రూ. 4,499 ధరకు లభిస్తుండగా, సేల్ నుంచి అమ్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 3,949 ధరకే అందుకోవచ్చని చెబుతోంది.
Amazon Echo Show 8 ను కూడా మంచి డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది. ఎకో షో ప్రస్తుతం రూ. 13,999 ధరకు సేల్ అవుతోంది. అయితే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ డివైజ్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 9,999 ధరకే అందుకోవచ్చట.
Amazon Fire TV Stick 4K ను కూడా అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకు పొందవచ్చని టీజింగ్ చేస్తోంది. ప్రస్తుతం రూ. 5,999 రూపాయల ధరతో సేల్ అవుతున్న ఈ స్ట్రీమింగ్ డివైజ్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 4,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చని చెబుతోంది.
ఇవి కాకుండా, ఫైర్ టీవీ స్టిక్, Eco 4th gen స్మార్ట్ స్పీకర్, Eco Show 10 మరియు Fire Tv Cube పై కూడా మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చని టీజింగ్ చేస్తోంది.