Airtel కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్ లాంచ్ , 300Mbps స్పీడ్ …

Airtel కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్ లాంచ్ ,  300Mbps స్పీడ్ …

భారతీ ఎయిర్టెల్ కొత్త బ్రాడ్బ్యాండ్నుప్లాన్ ని  ప్రవేశపెట్టింది, ఇది 300Mbps స్పీడ్  అందిస్తుంది. ఈ FTTH (ఫైబర్-టు-హోమ్) ప్లాన్ ధర నెలకు రూ .2,199 మరియు వినియోగదారులు ఈ ప్లాన్ లో 1200GB డేటా పొందుతారు. ఎయిర్టెల్ యొక్క నూతన ప్లాన్ లో అపరిమిత STD / లోకల్  కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్టెల్ యొక్క వెబ్సైట్ ప్రకారం, వినియోగదారులు ఈ ప్లాన్ లో 1000GB బోనస్ డేటా పొందుతారు, దీని వాలిడిటీ  అక్టోబరు 31, 2018 వరకు కొనసాగుతుంది. మీరు ఈ డేటాను మీ తదుపరి బిల్లింగ్ సైకిల్ లో కూడా జోడించవచ్చు. యూజర్లు ఈ ప్లాన్ లో ఒక సంవత్సరం పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొందుతారు, దీని ద్వారా వినియోగదారులు ప్రైమ్  వీడియోలు,ప్రైమ్ మ్యూజిక్  మరియు ఫాస్ట్ డెలివరీలు పొందవచ్చు. 

ప్రారంభించినప్పుడు భారతీ ఎయిర్టెల్ హోమ్స్ CEO, "మా V- ఫైబర్ హోమ్ బ్రాడ్బ్యాండ్ విజయం తర్వాత, వేగవంతమైన ఇంటర్నెట్ ని  కోరుకునే  వినియోగదారులకు ఒక కొత్త FTTH ఆధారిత ప్లాన్ ను పరిచయం చేస్తున్నాము. రాబోయే రోజులలో, మన FTTH ఆధారిత ప్లాన్ లను పెంచుతున్నాము మరియు వినియోగదారులకు వేర్వేరు ధరలు మరియుస్పీడ్  కోసం బ్రాడ్బ్యాండ్ ప్లాన్ లను  అందిస్తాము.అని తెలిపారు. 

ఈ ప్లాన్ను అప్గ్రేడ్ చేయడానికి ముందు, మీ ప్రాంతంలోని ఎయిర్టెల్ FTTH ను నిర్ధారించాలో లేదో తనిఖీ చేయాలి. దీని కోసం ఎయిర్టెల్ యొక్క వెబ్ సైట్ లేదా మై ఎయిర్టెల్ అప్లికేషన్లను కూడా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.

 

Digit.in
Logo
Digit.in
Logo