Aadhaar New App: మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇట్టే మార్చుకోండి..!
యూజర్ అనుకూలత కోసం UIDAI కీలక నిర్ణయాలు తీసుకుంది
UIDAI ఇప్పుడు కొత్త సర్వీస్ లతో కూడిన కొత్త యాప్స్ కూడా తీసుకొచ్చింది
ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి యూజర్లకు నేరుగా అవకాశం అందించింది
Aadhaar New App: ఆధార్ కార్డు సెక్యూరిటీ కోసం మరియు యూజర్ అనుకూలత కోసం UIDAI కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ఆధార్ సేవలను మరింత పెంచిన యుఐడిఎఐ, ఇప్పుడు కొత్త సర్వీస్ లతో కూడిన కొత్త యాప్స్ కూడా తీసుకొచ్చింది. ఈ యాప్స్ ను మరింత శక్తివంతంగా చేసే కొత్త ఫీచర్స్ కూడా ఇప్పుడు ప్రవేశ పెట్టింది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రభుత్వం రీసెంట్ గా అందించిన కొత్త ఆధార్ యాప్ లో ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి యూజర్లకు నేరుగా అవకాశం అందించింది.
SurveyAadhaar New App: ఏమిటి ఇది?
ఆధార్ యూజర్ల కోసం యుఐడిఎఐ రీసెంట్ గా కొత్త ఆధార్ యాప్ విడుదల చేసింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా అందుబాటులో ఉంది. ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త యాప్. మీ ఆధార్ కార్డు ను మీ ఫోన్ లో సురక్షితంగా భద్రపరచడానికి, లాక్ చేయడానికి మరియు అవసరమైనప్పుడు డూప్లికేట్ గా చూపడానికి కూడా ఉపయోగపడే అఫీషియల్ మొబైల్ అప్లికేషన్ ఇది. ఇందులో కొత్త ఫీచర్స్ ను కూడా ప్రభుత్వం రెగ్యులర్ గా యాడ్ చేస్తోంది.
కొత్త అప్డేట్స్ లో భాగంగా ఈ యాప్ లో ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ చేంజ్ కోసం కొత్త ఫీచర్ అందించింది. దీనితో యూజర్ సొంతంగా ఈ అప్డేట్ ను చేసుకునే అవకాశం అందించింది. అయితే, దీనికి తగిన రుసుము చెల్లించాలని గుర్తుంచుకోండి.
Aadhaar New App: ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి?
కొత్త ఆధార్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ లాగిన్ అవ్వండి. ఆఫ్ కోర్స్ దీనికోసం ఆధార్ తో అనుసంధానమైన మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ పై OTP అందుతుంది ఆ OTP నెంబర్ తో లాగిన్ అవ్వండి. తర్వాత ఈ యాప్ లో అడుగున వచ్చే ‘Service’ ఆప్షన్ లో నా ఆధార్ అప్డేట్ లేదా ‘My Aadhar Update’ పెయిన్ నొక్కండి. వెంటనే మీకు ఆధార్ అప్‌డేట్ కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

కొట్టే పేజీ లో అన్నింటి కంటే పైన మొబైల్ నెంబర్ అప్డేట్ అనే ట్యాబ్ వస్తుంది, దీనిపైన నొక్కండి. నొక్కినా వెంటనే మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం చెల్లించాల్సిన రూ. 75 రూపాయల ఫీజు మరియు పట్టె సముయం గురించి చూపిస్తుంది మరియు దీని అడుగున ‘కొనసాగించు’ అని ఆప్షన్ వస్తుంది. దీనిపైన నొక్కగానే, మీ పాత నెంబర్ వస్తుంది మరియు మీరు అప్‌డేట్ చేయదలచిన కొత్త మొబైల్ నెంబర్ కోసం బాక్స్ అందిస్తుంది. ఇక్కడ మీ కొత్త నెంబర్ అందించి OTP రిక్వెస్ట్ కోసం క్లిక్ చేయండి.
Also Read: OnePlus 15R సెగ్మెంట్ ఫస్ట్ 4K 120FPS పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!
మీ పాత నెంబర్ పై అందుకున్న OTP ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది. ఇక్కడ పేమెంట్ చెల్లించండి. అంతే, మీరు కోరుకున్న కొత్త మొబైల్ నెంబర్ ఆదార్ కార్డు తో అప్డేట్ చేయబడుతుంది.